గ్రాండ్‌గా మనోజ్-ప్రణతి రెడ్డి ఎంగేజ్మెంట్ (ఫోటోస్)
హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ ఎంగేజ్మెంట్ ప్రణతి రెడ్డితో ఈ రోజు ఉదయం గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ ఇందుకు వేదికైంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. నిశ్చితార్థం అనంతరం ఫ్యామిలీ అంతా కలిసి గ్రూఫు ఫోటో దిగారు.
మోహన్ బాబు ద్వారా ప్రకటన
'మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి క్లాస్‌మేట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణలతో పరిచయం అయ్యింది. మనోజ్, ప్రణతిల పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. న్యూయార్క్‌లో సీపీఏ(అమెరికాలో ఛార్టెడ్ ఎక్కౌంట్ ని సీపీఎ అంటారు) చేసింది. మీ అందరి ఆశీస్సులతో వివాహం జరుగుతుంది '' అని మోహన్‌బాబు పేర్కొన్నారు.
స్లైడ్ షోలో ఫోటోలు...

మనోజ్-ప్రణతి
మంచు మనోజ్-ప్రణతి రెడ్డిలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఫ్యామిలీ ఫోటో...
నిశ్చితార్థం అనంతరం మంచు మనోజ్-ప్రణతి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

రాజకీయ ప్రముఖులు
మనోజ్-ప్రణతి నిశ్చితార్థ వేడుకలో సుశీల్ కుమార్ షిండే, రామోజీరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు...

వెరోనికా, లక్ష్మి
తన ప్రాణ స్నేహితురాలు తనకు తోటి కోడలుగా వస్తుండటంతో వెరోనికా చాలా సంతోషంగా ఉంది.

తాప్పీ
నిశ్చితార్థం సందర్భంగా తాప్సీతో కలిసి మంచు లక్ష్మి

చిరంజీవి
మంచు మనోజ్-ప్రణతి రెడ్డిలను ఆశీర్వదిస్తున్న చిరంజీవి

ఫ్యామిలీతో చిరంజీవి
ఈ నిశ్చితార్త వేడుకకు చిరంజీవి ఫ్యామిలీతో హాజరయ్యారు. చరణ్, సురేఖలను ఈ చిత్రంలో చూడొచ్చు.

అఖిల్
ఎంగేజ్మెంట్ సెర్మనీలో అఖిల్ అక్కినేని.

జగన్
మంచు మనోజ్ ఎంగేజ్మెంటు వేడుకలో వైఎస్ జగన్.

దాసరి
మంచు మనోజ్ ఎంగేజ్మెంట్ వేడుకలో దాసరి నారాయణరావు

స్నేహితులతో కలిసి
ఎంగేజ్మెంట్ వేడుకలో మనోజ్ స్నేహితుల సందడి.


Click it and Unblock the Notifications











