For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏం మాట్లాడుతున్నారు.. అలాంటి కుక్కల్ని చెప్పుతో కొట్టాలి: మంచు మనోజ్

  |
  Manchu Manoj Responded On Pranay Issue

  ప్రణయ్ పరువు హత్య కరెక్టే అంటూ కొందరు వ్యాఖ్యానించడంపై సినీ నటుడు మంచు మనోజ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇలా వాదిస్తున్న వ్యక్తులు ఉన్న సమాజంలో తాను ఉన్నందుకు సిగ్గుగా ఉందని ఫైర్ అయ్యారు. ఇంత దారుణమైన సంఘటన గురించి నేను మాట్లాడతానని ఎప్పుడూ ఊహించలేదు. కులం అనే గోడల్ని కలం చెరపలేనప్పడు. అందరూ సమానం, అంతా సమానం, మనుషులంతా ఒక్కటే అని నేర్చించలేని ఈ విద్యా వ్యవస్థ మొత్తం సిగ్గు పడాలి.... అంటూ మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  నాయనమ్మ చనిపోయిన బాధ లేదా? మంచు లక్ష్మి చేసిన పనికి నెటిజన్ల ఆగ్రహం!

  అయ్యో పాపం అనాల్సింది పోయి ఇదేంటి?

  అయ్యో పాపం అనాల్సింది పోయి ఇదేంటి?

  ప్రణయ్ హత్య విషయంలో అయ్యో పాపం అనాల్సిన సమయంలో తనను చంపడానికి కారణం ఏమిటని వెతుకుతున్నారు. కొందరేమో పరువు కోసం చంపారని, మరికొందరేమో స్టేటస్ కోసం చంపారని కొత్త కొత్త అబద్దాలు సృష్టించుకుని బ్రతుకుతున్నారు. అలా చేసిన వారు ప్రతి ఒక్కరూ సిగ్గు పడాలని మనోజ్ అన్నారు.

   ఆ వయసులో స్వచ్ఛమైన ప్రేమ తప్ప ఏమీ ఉండదు

  ఆ వయసులో స్వచ్ఛమైన ప్రేమ తప్ప ఏమీ ఉండదు

  10వ క్లాస్‌ నుండి ప్రేమించుకున్న వారికి ఏం తెలుస్తుందండీ?... కులం గురించి తెలుస్తుందా?... మతం గురించి తెలుస్తుందా?... స్టేటస్ గురించి తెలుస్తుందా?.. ఆ వయసులో వారి మధ్య స్వచ్ఛమైన ప్రేమ తప్ప మీరేదీ ఉండదు అని మనోజ్ తెలిపారు.

  అలా అంటున్న కుక్కల్ని చెప్పుతో కొట్టాలి

  అలా అంటున్న కుక్కల్ని చెప్పుతో కొట్టాలి

  ఈ మధ్య ఫేస్ బుక్, ట్విట్టర్లో చూస్తున్నాను. ఆ అమ్మాయి తండ్రి చేసింది చాలా కరెక్ట్ అని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న కుక్కలందరినీ చెప్పుతో కొట్టాలి. అలా అనడానికి మీకు మనసెలా వస్తుంది? ముందు పోలీసులుగానీ, గవర్నమెంటుకానీ అలాంటి నరహంతకులను సపోర్ట్ చేస్తున్న వారి పేర్లు నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బ్రతికే ఈ సమాజంలో మళ్లీ వారే ఇలాంటి దారుణాలు సృష్టిస్తారు... అని మనోజ్ అన్నారు.

  చట్టాలు నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలి

  చట్టాలు నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలి

  మీడియాను, ప్రభుత్వాన్ని, ప్రతి ఒక్కరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ చట్టాలను మనం నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాలి. దుబాయ్, అరబ్ కంట్రీల్లో తప్పు చేసిన వారిని రోడ్డు మీదకు తీసుకొచ్చి రాళ్లతో కొట్టడమో, ఉరి తీయడం చేస్తారు. అలాంటి శిక్షలు వస్తే తప్ప ఇలాంటి వారు భయపడరు.... అని మనోజ్ అన్నారు.

  మన పిల్లలకు మంచి భవిష్యత్ ఇద్దాం

  మన పిల్లలకు మంచి భవిష్యత్ ఇద్దాం

  మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు, కులం కోసం చంపడాలు ఒకే లెక్క కిందకు వస్తాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరుగకుండా మన పిల్లలకు మంచి భవిష్యత్, మంచి ప్రపంచాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను.

   మీకు ఇలా జరిగినందుకు సారీ

  మీకు ఇలా జరిగినందుకు సారీ

  ఇలాంటివి చోటు చేసుకున్నందుకు ప్రణయ్ కుటుంబానికి సారీ. ఆయన భార్యకు, కడుపులో ఉన్న బిడ్డకు రియల్లీ సారీ. ఈ సమాజం కొందరు కుక్కల వల్ల ఇలా తయారైంది. మళ్లీ మనం అందరం కలిసి మెలిసి ఉందాం. మనుషులంతా ఒకటే అని మంజు మనోజ్ వ్యాఖ్యానించారు.

  English summary
  Manchu Manoj Responded on Pranay murder and Maruthi Rao supporters. People of all sections deny the murder in Miryalguda in the Telugu state. Telugu star Manchu Manoj been furious over Pranay murder case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X