భార్యతో విడాకులు... క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవల ఓ పబ్‌లో జరిగిన గొడవతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దాని గురించి మరిచిపోక ముందే మనోజ్ తన భార్య ప్రణతితో విడిపోతున్నట్లు మీడియాలో వార్తలు రావడంతో అభిమానులు షాకయ్యారు. మూడేళ్ల క్రితం పెళ్లైన మనోజ్, ప్రణతి మధ్య ఇపుడు సరైన సంబంధాలు లేవని, ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో ఆమె తన పుట్టింటికి అమెరికా వెళ్లిపోయిందని, ఇద్దరూ ఇపుడు కలిసుండటం లేదని, విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా అభిమానులతో ట్విట్టర్ చాట్లో పాల్గొన్న మనోజ్‌ను అభిమాని ప్రశ్నించగా క్లారిటీ ఇచ్చారు.

భార్యతో విడాకులు తీసుకుంటున్నారా?
మీరు మీ భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు విన్నాము... నిజమేనా? అనే ప్రశ్నకు మనోజ్ స్పందిస్తూ ‘వాళ్ల బొంద. ప్రణతి నా దేవత' అంటూ సమాధానం ఇచ్చారు. మనోజ్ సమాధానంతో ఈ విషయంలో అభిమానుల్లో నెలకొన్న డౌట్ క్లియర్ అయినట్లయింది.

అన్నయ్య దర్శకత్వంలో చేస్తున్నారా?
అన్నయ్య మంచు విష్ణు దర్శకత్వంలో నటించబోతున్నట్లు కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై కూడా మనోజ్ క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని అభిమానులకు స్పష్టం చేశారు.

నెక్ట్స్ సినిమా ఎలా ఉంటుంది?
తన తర్వాతి చిత్రం ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని, ఆగస్టులో ఇందుకు సంబంధించిన షూటింగ్ మొదలవుతుందని... మనోజ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

అల్లుడు గారు నా ఆప్షన్
మీ నాన్న సినిమాలు రీమేక్ చేస్తే మీరు ఏ సినిమాను ఎంచుకుంటారు? అనే ప్రశ్నకు మనోజ్ స్పందిస్తూ ‘ అల్లుడు గారు' అని సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











