For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మంచు మనోజ్‌ 'పోటుగాడు'

  By Srikanya
  |
  హైదరాబాద్ : మంచు మనోజ్‌ త్వరలో 'పోటుగాడు'గా కెమెరా ముందుకు రాబోతున్నారు. లగడపాటి శ్రీధర్‌, శిరీష సంయుక్తంగా నిర్మించే చిత్రమిది. ఈ సినిమాకి పవన్‌ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రంలో మనోజ్‌ సరసన నలుగురు హీరోయిన్స్ ఉంటారు. ఓ హీరోయిన్ గా సాక్షి చౌదరి ఎంపికైంది. ఈ నెలలోనే షూటింగ్ మొదలవుతుంది.

  'దేనికైనా రెడీ'చిత్రంతో వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న మంచు విష్ణుకు హిట్ ఇచ్చిన జి.నాగేశ్వరరెడ్డి తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ సారి మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ ని డైరక్ట్ చేయనున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మంచు మనోజ్ కూడా బిందాస్ చిత్రం తర్వాత ఒక్క హిట్టూ కూడా రాలేదు. దాంతో తన అన్నకు హిట్ ఇచ్చిన నాగేశ్వరరెడ్డి తనకూ హిట్ ఇస్తారని భావించి ఓకే చేసారు.

  'దేనికైనా రెడీ'ఓ మళయాళ చిత్రం రీమేక్ గా తయారైనట్లే ఈ చిత్రం కూడా ఓ రీమేక్ అని వినపడుతోంది. మళయాళ హిరో దిలీప్ రీసెంట్ చిత్రం తేజూ భాయ్ అండ్ ఫ్యామిలీ అనే చిత్రం రైట్స్ తీసుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ మేరకు గత కొద్ది రోజులుగా కథా చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. ఈ చిత్రం ఓ డాన్ కథగా జరుగుతుంది. గతంలో వచ్చిన ప్రేమ అండ్ కో,సకుంబ సపరివార సమేతంగా తరహా చిత్రంలా కథనం నడుస్తుంది. అయితే ఈ సారి ఓ డాన్ ప్రేమలో పడి,తనకు కుటుంబం లేకపోవటంతో వివాహం కోసం అద్దెకు కుటుంబాన్ని తెచ్చుకుంటాడు. అక్కడ నుంచి వచ్చే కామెడీతో సినిమా నడుస్తుంది. అయితే ఈ చిత్రం రీమేక్ అవునా కాదా అన్నది తెలియాల్సి ఉంది.

  ఇక మంచు మనోజ్ కు కూడా హిట్ ఇప్పుడు చాలా అవసరం. వైవిద్యం కోసం తీస్తున్న ఆయన చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతన్నాయి. రీసెంట్ గా భారీ అంచనాలతో వచ్చిన ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది. బాలకృష్ణ వంటి స్టార్ హీరో కీ రోల్ లో చేసినా చిత్రం నిలబడలేదు. దాంతో మంచు మనోజ్ దృష్టి మొత్తం ఈ చిత్రంపై పెట్టారు. ఈ సారి కామెడీతో హిట్ ని పొందాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మనోజ్ సినిమాలు ఫెయిల్యూర్ అయినా,నటుడుగా అతని ఎఫెర్ట్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కాబట్టి అతనకంటూ అభిమానులు,నిర్మాతలు ఉన్నారు. బస్ స్టాఫ్ చిత్రంతో హిట్ కొట్టిన బెల్లంకొండ సురేష్ మరోసారి ఈ సినిమాతో మెగా హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు.

  English summary
  Manchu Manoj has carved a niche of his own. Last, we saw him in Uu Kodatara Ulikki Padutara, now he will be acting in a full-length romantic comedy film. Titled as Potugadu the film will be made on a huge budget. The title itself has gathered enough curiosity. Directed by Pawan, this film is being produced by Sirisha and Sridhar under the Ramalakshmi Creations Banner. Shoot will start from this month end and major part of the movie will be shot in Jog Falls in Karnataka and Hyderabad in a single schedule. Interestingly this film will have four heroines. Sakshi Chowdary is one of the heroines. Reportedly Potugadu is going to be biggest budgeted movie in Manoj's career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X