మంచు మనోజ్ 'బిందాస్' చిత్రం రిలీజ్ డేట్

By Srikanya

మంచు మనోజ్ హీరోగా రచయిత నుంచి డైరక్టర్ గా మారిన వీరు పోట్ల దర్శకత్వంలో 'బిందాస్' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పిబ్రవరి ఐదున రిలీజ్ చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు వీరూపోట్ల గతంలో రచయితగా మనసంతా నువ్వే, సంతోషం, నువ్వు వస్తానంటే నే వద్దంటానా, వర్షం తదితర హిట్ చిత్రాలకు కథలందించారు. అలాగే ఈ చిత్రంలో మంచు మనోజ్‌ కి జోడీగా షీనా అనే కొత్త నటి పరిచయమవుతోంది. నమో వెంకటేశ చిత్రం నిర్మించిన ఎ.కె.ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. విడుదల సందర్బంగా డైరక్టర్ వీరు పోట్ల మాట్లాడుతూ 'ఫ్యామిలీ, లవ్‌, ఎంటర్‌టైన్‌ మెంట్‌, యాక్షన్‌ అంశాలతో ఈ సినిమా ఉంటుంది. అలాగే సంగీత దర్శకుడు బోబో శశి ఈ చిత్రానికి మంచి బాణీలు అందించారు' అన్నారు. ఇక ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో జయప్రకాష రెడ్డి, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, 'ఆహుతి' ప్రసాద్‌, కాశీ విశ్వనాథ్‌, సుబ్బరాజు, మాస్టర్‌ భరత్‌ తదితరులు కనిపించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X