మనోజ్ 'బిందాస్' ఆడియో ఎప్పుడంటే...
మనసంతా నువ్వే, సంతోషం, నువ్వు వస్తానంటే నే వద్దంటానా, వర్షం తదితర హిట్ చిత్రాలకు కథలందిచిన వీరూ పోట్ల దర్శకుడుగా మారి 'బిందాస్' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్, షీనా జంటగా ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్యాచ్ వర్క్ మినహా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..ఈ నెల 9న సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో చిత్రం ఆడియో ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక డైరక్టర్ వీరు పోట్ల మాట్లాడుతూ 'ఫ్యామిలీ, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ అంశాలతో ఈ సినిమా ఉంటుంది. సంగీత దర్శకుడు బోబో శశి ఈ చిత్రానికి మంచి బాణీలు అందించారు' అన్నారు. ఇక ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో జయప్రకాష రెడ్డి, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, 'ఆహుతి' ప్రసాద్, కాశీ విశ్వనాథ్, సుబ్బరాజు, మాస్టర్ భరత్ తదితరులు కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











