పల్లెటూరి మొనగాడు ('కరెంట్ తీగ' ప్రివ్యూ)
హైదరాబాద్: హీరో పల్లెటూరు నేపధ్యం నుంచి వచ్చే కథలు తెలుగు తెరపై అరుదైపోయాయి. తాజాగా అలాంటి కథతో మంచు మనోజ్ ఈ రోజు థియోటర్స్ లో దిగుతున్నాడు. తియ్యటి షాక్ ఇస్తానంటూ తమిళంలో విజయవంతమైన ‘వరుత్తపడాద వాలిబర్ సంగం' రీమేక్ తో వస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్స్ తీసే నాగేశ్వరరెడ్డి దర్శకుడు కావటం, సన్నిలియోన్ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూండటంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
కథలో ...మనోజ్, వెన్నెల కిషోర్ అవారా బ్యాచ్. ఎప్పుడూ ఎవరో ఒకరిని కెలుకుతూ,పెద్దోళ్లతో వాదిస్తూ ఉంటూంటారు. ఈ గ్రూప్ కి అంతటికీ మంచు మనోజ్ లీడర్. అలాగే పెద్దోళ్ళ బ్యాచ్ కు హెడ్ జగపతిబాబు. ఈ రెండు గ్రూప్ లు ఎప్పుడూ క్షణం పడదు. ఈ గొడవలు ఇలా ఉండగానే మనోజ్ వెళ్లి రకుల్ ప్రీతి సింగ్ తో ప్రేమలో పడతాడు. ఇంతకీ రకుల్ ఎవరూ అంటే జగపతిబాబు కూతురు. ఎలా తన ప్రేమని సఫలం చేసుకున్నాడు అనేది మిగతా కథ.
మంచు మనోజ్ మాట్లాడుతూ....మంచి కథ కోసం అన్వేషిస్తుంటే ‘వరుత్తపడాద వాలిబర్ సంగం' గురించి చెప్పారు. నేను కూడా సినిమా చూశా. చాలా బాగా నచ్చింది. తెలుగులో తిరుమల కిశోర్ డైలాగులు రాశాడు. ప్రతి సీనుకూ రెండు, మూడు పంచ్‌లు తప్పకుండా పడతాయి. రాయలసీమ యాసలో ఎక్కువగా సినిమా సాగుతుంది. ముఖ్యంగా తిరుపతి పరిసరాలను ప్రతిబింబించే సినిమా అవుతుంది.'' అన్నారు.
అలాగే...''పక్కా వాణిజ్య చిత్రం 'కరెంట్ తీగ'. తమిళ చిత్రానికి రీమేక్ అయినా కథలో మార్పులు చేశాం. సన్నివేశాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకొన్నాం. జగపతిబాబు పాత్ర ఈ చిత్రానికి ప్రాణం పోసింది. ఆయన్ని ఈ సినిమాతో జగ్గూభాయ్‌ని చేశాం. కథ చెప్పగానే పారితోషికం గురించి కూడా ఆలోచించకుండా 'నేను ఈ సినిమా చేస్తా' అనేశారు. ఇప్పటి వరకూ నాతో నటించిన కథానాయికల్లో రకుల్ ప్రీత్‌సింగ్ అత్యుత్తమం. తెలుగమ్మాయి కాకపోయినా తెలుగు నేర్చుకొని మరీ డైలాగులు చెప్పింది. తప్పకుండా తనకు మంచి భవిష్యత్తు ఉంది'' అన్నారు.

బ్యానర్: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నటీనటులు: మంచు మనోజ్, రకుల్ ప్రీతి సింగ్, సన్నిలియోన్, జగపతిబాబు, సంపూర్ణేష్‌బాబు, ఫిరోజ్ అబ్బాసి, గిరిబాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, రఘుబాబు, జీవా, ఫిష్ వెంకట్, టార్జాన్, వెనె్నల కిశోర్, ధన్‌రాజ్, తా.రమేష్, సుప్రీత్, శివారెడ్డి, పృధ్వీ, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గీతాంజలి, రవిశేఖర్ తదితరులు
కెమెరా: సతీష్ ముత్యాల,
మాటలు:కిశోర్ తిరుమల,
ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్,
పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, వరికుప్పల యాదగిరి,
నిర్మాత:విష్ణు మంచు,
స్క్రీన్ ప్లే, దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి.
సమర్పణ: డా.ఎమ్.మోహన్ బాబు
విడుదల తేదీ: 31, అక్టోబర్ 2014.


Click it and Unblock the Notifications











