»   » మంచు మనోజ్ ఎంగేజ్మెంట్ డేట్

మంచు మనోజ్ ఎంగేజ్మెంట్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మనోజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. విరానికా మిత్రురాలైన ప్రణతి రెడ్డిని మనోజ్ త్వరలో వివాహమాడబోతున్నాడు. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్సయింది. మార్చి 4, ఉదయం 10.30 గంటలకు డేట్ ఫిక్స్ చేసారు. హైదరాబాద్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ ఎంగేజ్మెంట్ సెర్మనీ జరుగనుంది. అట్టహాసంగా ఈ వేడుక జరుగబోతోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఇన్విటేషన్ అందినట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Manchu Manoj’s engagement on 4th March

మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల విషయం మీడియాకు లీక్ కాగానే మోహన్ బాబు స్వయంగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. ''గత 40 ఏళ్లుగా నన్నూ, నా కుటుంబాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, అభిమానులకూ హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్య కొన్ని ఛానెల్స్ లోనూ, కొన్ని పత్రికల్లోనూ మనోజ్ కుమార్ వివాహ విషయమై వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు సంభందించి, స్పష్టమైన సమాచారం ఇవ్వడం నా భాధ్యత. నాక్కాబోయే కోడలి పేరు ప్రణతి '' అని మోహన్‌బాబు అన్నారు.

''మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి క్లాస్‌మేట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణలతో పరిచయం అయ్యింది. మనోజ్, ప్రణతిల పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. ఓ శుభముహూర్తాన నిశ్చయ తాంబూలం, అనంతరం పెళ్లి జరుపుతాం. నాక్కాబోయే కోడలు ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. న్యూయార్క్‌లో సీపీఏ(అమెరికాలో ఛార్టెడ్ ఎక్కౌంట్ ని సీపీఎ అంటారు) చేసింది. మీ అందరి ఆశీస్సులతో వివాహం జరుగుతుంది '' అని మోహన్‌బాబు పేర్కొన్నారు.

English summary
Machu Manoj, the youngest son of Mohan Babu, will be getting engaged to his lady love Pranathi Reddy at 10:30 AM on the 4th of March.
Please Wait while comments are loading...