»   » ఈ సారి మంచు మనోజ్ కి దెబ్బ

ఈ సారి మంచు మనోజ్ కి దెబ్బ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ మధ్యన హీరో, హీరోయిన్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ ఎక్కౌంట్స్ హ్యాకింగ్ గురి కావటం రెగ్యులర్ గా యాక్టివిటిగా మారిపోయింది. తాజాగా ఆన్ లైన్ హ్యాకర్స్ దాడికి మంచు మనోజ్ ఫేస్ బుక్ ఎక్కౌంట్ బలి అయ్యింది. ఆయన తన ఎక్కౌంట్ హ్యాక్ అయ్యిందనే విషయం తెలుసుకుని వెంటనే మీడియాకు తెలియచేసారు. "నా పర్శనల్ ఫేస్ బుక్ ఎక్కౌంట్ (www.facebook.com/manojkmanchu) హ్యాక్ అయ్యింది..నేను తిరిగి వచ్చి చెప్పేదాకా ఆ ఎక్కౌంట్ కు ఏ విధమైన మెసేజులు పంపకండి, అలాగే రిప్లైలు ఇవ్వద్దు....ధాంక్యూ !!," అన్నారు.

ఇక మంచు విష్ణుతో 'దేనికైనా రెడీ' అనిపించారు జి.నాగేశ్వరరెడ్డి. ఇప్పుడు తమ్ముడు మనోజ్‌కి హిట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మంచు మనోజ్‌ - జి.నాగేశ్వరరెడ్డి కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో ఆకట్టుకొన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్ . ఈ చిత్రానికి 'కరెంటు తీగ' అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. మనోజ్‌ శైలికి తగినట్టే ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. యాక్షన్‌ అంశాలకూ ప్రాధాన్యం ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

Manchu Manoj’s Facebook account hacked

అలాగే పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో హిట్ కొట్టి ఉత్సాహంలో ఉన్న మంచు మనోజ్ తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నాడు. ఈ చిత్రం టైటిల్ సన్నాఫ్ పెద రాయుడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుందని చెప్తున్నారు.

మోహన్‌బాబు కెరీర్‌లో కలికితురాయి లాంటి సినిమా 'పెదరాయుడు'.బాక్సాఫీస్‌ వద్ద సంచలన వసూళ్లను సాధించిన గొప చిత్రమిది. అంతేకాదు డైలాగ్‌కింగ్‌ని ఓ రేంజులో చూపించారీ చిత్రంలో. ఈ సినిమాకి సీక్వెల్‌ 'సన్నాఫ్‌ పెదరాయుడు'.కొత్త దర్శకుడు సాగర్‌ పసల దర్శకత్వం వహిస్తారని, అమెరికా షెడ్యూల్‌ మొదలవుతోందని తెలుస్తోంది. ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ-''హాలీవుడ్‌లో మోషన్ పిక్చర్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వంలో శిక్షణ పొంది, హాలీవుడ్‌లో 'డార్క్ ఫీల్డ్స్' చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసి, తెలుగులో 'కిక్' సురేందర్‌రెడ్డి వద్ద పలు చిత్రాలకు పనిచేసిన పి.సాగర్‌ని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మంచు మనోజ్‌తో నిర్మిస్తున్న ఈ 'సన్నాఫ్ పెదరాయుడు' అతి త్వరలో ప్రారంభం అవుతుంది. మనోజ్ కెరీర్‌ని కొత్త మలుపు తిప్పే వైవిధ్యమైన కథతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తాం''అన్నారు.


English summary
"My personal FB account (www.facebook.com/manojkmanchu) has been hacked since yesterday night. Please don't send any messages or reply to any messages from that account till I get it back... thank you !!," posted Manoj Manchu online.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu