హాట్ టాపిక్: లేడీ గెటప్ లో మంచు మనోజ్ (ఫోటో)
హైదరాబాద్: లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు సమర్పణలో శ్రీవాస్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద'. ప్రధానపాత్రల్లో మోహన్‌బాబుతో పాటు మంచు మనోజ్, విష్ణు నటిస్తున్నారు. మంచు మనోజ్ మహిళ వేషధారణలో ఉన్న చిత్రాన్ని యూనిట్ విడుదల చేసింది. బాబాసెహగల్ నేతృత్వంలో రూపొందిన ప్రచార గీతం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రాన్ని జనవరి 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కీరవాణి, బప్పీలహరి, మణిశర్మ, బాబా సెహగల్ సంగీతం అందిస్తున్నారు.
విష్ణు మాట్లాడుతూ ''బాలీవుడ్‌లో వసూళ్ల వర్షం కురిపించిన 'గోల్‌మాల్3'కిది రీమేక్. నాన్నగారు, తమ్ముడూ, నేనూ కలసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ప్రత్యేక అంచనాలున్నాయి. తప్పకుండా వాటిని అందుకొంటాం. నాన్నగారి పాత్ర, తమ్ముడి స్త్రీ గెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది''అన్నారు.
సిక్స్‌ప్యాక్‌లాంటి బాడీకి చీర చుట్టేసి, కాస్త సిగ్గుని, ఇంకాస్త సింగారాన్నీ మిక్స్ చేసి మగాళ్ల మతులు పోగొట్టేలా ముస్తాబైన ఈ సొట్టబుగ్గల సౌందర్యం గురించే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. మంచు మనోజ్...మామూలుగా ఉంటేనే... చిలిపి పనులు చేస్తాడు. ఇప్పుడు ఏకంగా అవతారమే కాస్త తేడాగుంది. ఇంకెన్ని మాయలు చేస్తాడో..? ఈ అవతారం వెనుక ఉన్న అసలు కథేంటో తెలియాలంటే 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా చూడాల్సిందే అంటున్నారు నిర్మాత.
మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ కలసి నటించిన చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' . బ్రహ్మానందం, ఎంఎస్.నారాయణ, అలీ, రఘుబాబు, గుర్లిన్ చోప్రా, అలేఖ్యవర్మ, తెలంగాణ శకుంతల, గిరిబాబు, పోసాని కృష్ణ మురళి, కాశీ విశ్వనథ్, కృష్ణ భగవాన్, సుప్రీత్, భరణి, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్నబాబు, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.


Click it and Unblock the Notifications












