»   »  కొత్తగా ఉంది: మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ (ఫస్ట్ లుక్)

కొత్తగా ఉంది: మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మనోజ్ త్వరలో 'ఒక్కడు మిగిలాడు' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాడు. ఈ చిత్రంలో మనోజ్ గత సినిమాలకు భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంటెన్స్, ఎమెషన్స్ కలిగిన పాత్రలో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నాడు.

మనోజ్ చివరగా నటించిన చిత్రం శౌర్య. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మనోజ్...కథ పరంగా, తన పాత్ర పరంగా మంచి పేరొచ్చే పాత్రను ఎంపిక చేసుకున్నాడు. ఈ చిత్రానికి అజయ్ ఆండ్రివ్ దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమా ఇప్పటి వరకు 40శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో చిత్ర బృందం భారీసెట్‌ను రూపొందించి సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఇటీవల షూటింగులో చిన్న గొడవ కూడా జరిగింది. డబ్బు చెల్లింపుల విషయంలో జరిగిన ఈ గొడవలో కొందరు జూనియర్ ఆస్టిస్టులు నిర్మాతపై దాడి చేసారు. ఈ కారణంగా ఒక రోజు షూటింగుకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.

ఒక్కడు మిగిలాడు సినిమాకు సంబంధించిన మనోజ్ న్యూ లుక్...

సూపర్బ్

సూపర్బ్


మంచు మనోజ్ ఈ సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది.

ఇంటెన్స్, ఎమెషనల్

ఇంటెన్స్, ఎమెషనల్


ఈ సినిమాలో ఇంటెన్స్, ఎమోషనల్ పాత్ర చేస్తున్నానని, ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందని మనోజ్ తెలిపారు.

ఆర్మీ ఆఫీసర్

ఆర్మీ ఆఫీసర్


ఫోటో చూస్తుంటే ఈ సినిమాలో మనోజ్ ఆర్మీ ఆఫీసర్ గా తిరుగుబాటు దారుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది.

కొత్తగా ఉంది..

కొత్తగా ఉంది..


రొటీన్ సినిమాలకు భిన్నంగా మనోజ్ ఇలాంటి సబ్జెక్టుతో ముందుకు సాగడం చూస్తుంటే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా తాపత్రయ పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

English summary
Manchu Manoj is back to entertain us with a bunch of new assignments. First among them to hit the screens soon will be ‘Okkadu Migiladu.’ Directed by Ajay Andrews, the movie’s first pictures from shooting spot are out. The Army Officer look from the film which interprets something like a revolutionary subject.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu