»   » మంచు మనోజ్ పెళ్లి కొడుకు సెర్మనీ (ఫోటో)

మంచు మనోజ్ పెళ్లి కొడుకు సెర్మనీ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు ఫ్యామిలీ మొత్తం పెళ్లి వేడుకలో మునిగి తేలుతోంది. ఈ నెల 20వ తేదీన మంచు మనోజ్ తన ప్రేయసి ప్రణతిరెడ్డిని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి సందడి మొదలైంది. తాజాగా పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం నిర్వహించారు.

ఈ నెల 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు మనోజ్-ప్రణతి వివాహం జరుగబోతోంది. లక్ష్మి మంచు ఇంట్లో మెహందీ సెర్మనీ నిర్వహించనున్నారు. పార్క్ హయత్ హోటల్ లో సంగీత్ కార్యక్రమం జరుగబోతోంది. హైటెక్స్ వివాహ వేడుక గ్రాండ్ గా జరుగబోతోంది. ఈ పెళ్లి వేడుకకు దాదాపు 10వేల మందికి పైగా అథితులు హాజరవుతారని సమాచారం. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మనోజ్ నిశ్చితార్థం ప్రణతి రెడ్డితో మార్చి 4న జరిగింది. ఇక వీరి వివాహానికి పురోహితులు మే 20వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం జరగనుంది. మరో విశేషం ఏంటంటే మనోజ్ పుట్టిన రోజు కూడా మే 20వ తేదీయే. ప్రణతి రెడ్డిని మనోజ్ ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు.

Manchu Manoj's Pellikoduku Ceremony!

ఈ వివాహానికి పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే మంచు ఫ్యామిలీ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి శుభలేఖ అందజేసారు. మరో వైపు విష్ణు స్వయంగా వెళ్లి మహారాష్ట్ర గవర్నర్, తెలుగువాడైన విద్యాసాగర్ రావునుకూడా ఆహ్వానించారు.

పలువురు ప్రముఖులను మంచు ప్యామిలీ మెంబర్స్ స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. వివాహానికి సంబంధించిన శుభలేఖ ప్రత్యేకంగా తయారు చేయించారు. శుభలేఖ చాలా బావుందని ప్రధాని మోడీ కూడా ప్రశంసించారు కూడా. 

కాబోయే కోడలి గురించి మోహన్ బాబు స్వయంగా వెల్లడించారు ''మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి ఇద్దరూ క్లాస్ మెట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులకూ, మా కుటుంబానికీ పరిచయం ఏర్పడింది అని తెలిపారు. ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. ఆ తర్వాత న్యూయార్క్ లో సీపీఎ (అమెరికాలో చార్టెడ్ ఎకౌంటెంట్ ని సిపీఎ అంటారు) చేసింది. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆశీస్సులతో ఈ పెళ్లి జరుగుతుంది'' అని మోహన్ బాబు అన్నారు.

English summary
The Pellikoduku Ceremony of Manchu Manoj took place in Mohan Babu's House on Thursday. Here is the exclusive picture of Manchu Family from the pre-wedding festivities.
Please Wait while comments are loading...