మంచు మనోజ్..'పోటుగాడు' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే
హైదరాబాద్ : మంచు మనోజ్ ప్రస్తుతం 'పోటుగాడు' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని రీసెంట్ గా విడుదల చేసారు.
కన్నడ దర్శకుడు పవన్ వడెయార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, లగడపాటి శ్రీధర్ ఈచిత్రాన్ని రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. పోటుగాడు చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పని చేస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాక్షి చౌదరి, సిమ్రాన్ ముండి, నథాలియా కౌర్ నటిస్తున్నారు. ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం తర్వాత మనోజ్ చేస్తున్న సినిమా ఇదే.
ఇక ఈ చిత్రం ఓ కన్నడ రీమేక్ . కోమల్ హీరోగా వచ్చిన 'గోవిందాయ నమ:'.. చిత్రం తెలుగులో 'పోటుగాడు' గా తెరకెక్కుతోంది. కన్నడంలో దర్శకత్వం చేసిన పవన్ ఈ చిత్రానికి సైతం దర్శకత్వం వహిస్తున్నారు.
మంచు మనోజ్ చిత్రం గురించి చెప్తూ.. అటు పొగడ్తకి, ఇటు తెగడ్తకి రెండింటికీ సరిపోయే పదం 'పోటుగాడు'. నా శారీరకభాషకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. టైటిల్‌కి తగ్గట్టే ఇందులో తన పాత్ర కూడా ఉంటుందని మనోజ్ అంటున్నారు.


Click it and Unblock the Notifications












