అంచనాలకు తగ్గట్లుగా...(‘ఊకొడతారా..ఉలిక్కి పడతారా' ప్రివ్యూ)
హైదరాబాద్: బాలకృష్ణ అతిధిపాత్రలో రూపొందిన చిత్రం 'ఊకొడతారా..ఉలిక్కి పడతారా' ఈ నెల 27న విడుదల అవుతోంది. మంచు మనోజ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ వర్గాల్లోనే కాక,ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. బ్లాక్ కామెడీగా చెప్పబడుతున్న ఈ చిత్రం పై గత రెండు సంవత్సరాలుగా మనోజ్ వర్క్ చేస్తున్నారు. ప్లాఫ్ ల్లో ఉన్న తన కెరీర్ కి ఈ చిత్రం హిట్ ఇచ్చి నిలబెడుతుందని భావిస్తున్నాడు.
కథలోకి వస్తే...గంధర్వమహల్‌కు అధిపతి నరసింహరాయుడు (బాలకృష్ణ). గంధర్వ మహల్‌ను సొంతం చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో మహల్‌లోకి ఓ యువకుడు (మంచు మనోజ్) ప్రవేశిస్తాడు. నరసింహరాయుడు కుటుంబానికి ఆ యువకుడికి ఉన్న సంబంధం కథలో కీలకం. నరసింహరాయుడు మహల్‌ను రక్షించే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మిగిలిన కథ.
విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ''ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే ప్రధాన బలం. ప్రతి సన్నివేశం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. బాలకృష్ణ, మనోజ్‌ల నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. వారు తమ పాత్రలకు ప్రాణం పోశారు. గంధర్వమహల్ సెట్‌ని రూ.6 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దాం. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణ'' అన్నారు.
ఇప్పటికే 'ఊకొడతారా..ఉలిక్కి పడతారా'ట్రైలర్స్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మంచు ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పద్మశ్రీ డా.ఎం. మోహన్ బాబు సమర్పణలో మంచు మనోజ్, దీక్షాసేత్ హీరో హీరోయిన్లుగా శేఖర్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దర్శకుడు శేఖర్ రాజా చెప్పిన పాత్రలోని ఉదాత్తతకు ఆకర్షితులై 'ఊ కొడతారా..ఉలిక్కిపడతారా'లో నటించడానికి నందమూరి బాలకృష్ణ అంగీకరించారు. గత నెలలో ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
సంస్థ: మంచు ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు: బాలకృష్ణ, మంచు మనోజ్, దీక్షాసేథ్, మంచు లక్ష్మీప్రసన్న, ప్రభు, సుహాసిని, భానుచందర్, పృథ్వీ, రఘుబాబు తదితరులు.
దర్శకత్వం: శేఖర్‌రాజా
నిర్మాత: మంచు లక్ష్మీప్రసన్న
సంగీతం : బెబో శశి
సమర్పణ: మోహన్‌బాబు
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications











