మనోజ్ ‘యమధర్మరాజు ఎంఏ’ రీమేక్
డైలాగ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న తెలుగు నటుడు మోహన్ బాబు. అదిరి పోయే డైలాగులతో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అప్పట్లో మోహన్ బాబు హీరోగా వచ్చిన 'యమధర్మరాజు ఎంఏ" సినిమా మంచి హిట్ సాధించింది కూడా. అయితే తండ్రి వారసత్వాన్ని కొంతలో కొంత కూడా పుణికి పుచ్చుకోలేక పోయారు అతని వాసరసులు. మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు ఇప్పటికే దాదాపుగా హీరో వేషాలకు దూరం అయ్యాడు. మిగిలింది చిన్న కొడుకు మనోజ్ ఒక్కడే.
ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించినా తగిన గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు మనోజ్. తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందకు తండ్రి నటించిన సూపర్ హిట్ సినిమాలపై కన్నేశాడు మనోజ్. మోహన్ బాబు నటించిన 'యమ ధర్మరాజు ఎంఏ" సినిమా రీమేక్ లో నటించాలని ఉవ్విల్లూరుతున్నాడు. దీని కోసం ఇప్పటి నుంచే తండ్రి నటించిన ఆయా సినిమాల్లోని డైలాగులను రోజూ ప్రాక్టీస్ చేస్తూ...ఎలాంటి లాంగ్ డెలివరీ డైలాగ్ అయినా సరే చెప్పే స్టామినా సంపాదించే పనిలో నిమగ్నం అయ్యాడు. మరి మనోజ్ ఆరాటం..ఎంత మేరకు ఫలిస్తుందో...?


Click it and Unblock the Notifications











