twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడికి క్లారిటీ లేదని తేల్చాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : గతంలో కొన్ని సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించడం, ఇతరత్రా కొన్ని శాఖలను చూసుకోవడం వంటి పనులు చేశాను. అవన్నీ సరైన దర్శకుడు లేకనే. దర్శకుడికి క్లారిటీ లేనప్పుడు జోక్యం చేసుకోక తప్పలేదు. ఈ సినిమాలో నేను హీరోగా మాత్రమే చేస్తున్నాను. ఇంకే పనీ చేయడం లేదు అని తేల్చి చెప్పాడు మంచు మనోజ్. ఆయన గత కొంత కాలంగా తన సినిమాల్లో దర్శకులకు స్వేచ్చ లేకుండా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఈ నేపధ్యంలో మంచు మనోజ్ ఇలా చెప్పుకొచ్చారు. అయితే క్లారిటీ లేని డైరక్టర్సే ..మనోజ్ దగ్గరకి చేరుతున్నారా లేక...మనోజ్ దగ్గరకే వెళ్లేకే క్లారిటీ మిస్సవుతోందా అనేది అర్దం కావటం లేదని అంటున్నారు.

    Manchu Manoj said his directors have no clarity

    తన తాజా చిత్రం గురించి చెప్తూ... "'దేనికైనా రెడీ' తర్వాత నాగేశ్వరరెడ్డిగారు మా సంస్థలో చేస్తున్న సినిమా 'కరెంట్ తీగ'. రాఘవేంద్రరావు, చంద్రశేఖర్ ఏలేటిలాగా క్లారిటీ ఉన్న దర్శకుడు నాగేశ్వరరెడ్డి. చక్కగా తెరకెక్కిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అచ్చు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రకుల్ హీరోయిన్. మరో కీలక పాత్రలో సన్నీలియోన్ నటిస్తోంది. మా సినిమాలోని పాత్రకు చక్కగా సరిపోతుంది. ఆ పాత్రకు ఆమె అయితేనే కరెక్ట్ అనిపించి తీసుకున్నాం. 'నేను మీకు తెలుసా' సినిమాకు రచనా శాఖలో పనిచేసిన కిశోర్ ఈ సినిమాకు కూడా రచయితగా వ్యవహరిస్తున్నారు. మిలియన్ ఓల్ట్ పవరున్న కరెంట్ తీగలాంటి పల్లెటూరి కుర్రాడి కథ ఇది అన్నారు.

    తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి చెప్తూ... "'బిందాస్', 'వేదం', 'ఝుమ్మంది నాదం' సినిమాలను ఒకే సమయంలో నిర్విరామంగా చేశాను. అప్పుడసలు గ్యాప్ లేదు. కానీ ఇప్పుడు సినిమా తర్వాత సినిమా కుదురుతోంది. ప్రస్తుతం 'కరెంట్ తీగ'తో బిజీ. తర్వాత రెండు ప్రాజెక్ట్‌లున్నాయి. 'సన్నాఫ్ పెదరాయుడు' స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇంకో వెంచర్ మరోవైపు సిద్ధమవుతోంది. వీటి రెండిటిలో వెంటనే ఏది మొదలవుతుందో త్వరలో ప్రకటిస్తాం.'' అన్నారు.

    English summary
    Manchu Manoj said, "Except for Raghavender Rao and Chandra Sekhar Yeleti, all the directors I have worked are clarity less. They just do not know how to shoot what they said to me in the script stage".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X