నన్ను ఇన్సల్ట్ చేయొద్దు తమ్ముడు.. దేవుడి వల్లే.. మంచు మనోజ్!

Recommended Video

Manchu Manoj Posts Goes Viral In Social Media | Filmibeat Telugu

మంచు మనోజ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారనే విషయం అందరికి తెలిసిందే. సినిమా, సామజిక, రాజకీయ అంశాలన్నింటి గురించి మనోజ్ సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. మనోజ్ అభిప్రాయాలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమాల పరంగా ఇటీవల మనోజ్ సరైన విజయాలు అందుకోలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ నెటిజన్ కు మనోజ్ ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది.

ఏం జరిగిందంటే

ఏం జరిగిందంటే

కొన్ని రోజుల క్రితం మజోజ్ ఓ ట్వీట్ చేశాడు. ఓ పేషంట్ కు అత్యవసరంగా బ్లడ్ కావాలని మనోజ్ తన ట్విట్టర్ లో వివరాలని పోస్ట్ చేశాడు. మనోజ్ ట్వీట్ కు చాలా మంది అభిమానులు స్పందించారు. మనోజ్ కు ట్విట్టర్ లో మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉండడంతో మెసేజ్ వేంగంగా వైరల్ అయింది.

ఫ్యామిలీ సంతోషంగా

ఫ్యామిలీ సంతోషంగా

మనోజ్ చేసిన ట్వీట్ తో ఆ పేషంట్ కు సకాలంలో అవరమైన బ్లడ్ అందింది. అతడు కోలుకోవడంతో ఆ కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉన్నారు. మనోజ్ మానవతా చర్యని నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా మనోజ్ కు, పేషంట్ భందువుకు ఆసక్తికర సంభాషణ జరిగింది. మనోజ్ చేసిన సాయానికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇన్సల్ట్ చేయకు తమ్ముడు

థాంక్స్ మనోజ్ అన్నా.. నీవల్ల ఓ కుటంబం సంతోషంగా ఉంది. నీవు చేసిన ట్వీట్ వల్లే బ్లడ్ ఇవ్వడానికి చాలా మంది వచ్చారు అంటూ అతడు ట్వీట్ చేశాడు. దీనిపై మనోజ్ స్పందిస్తూ.. దయచేసి నాకు కృతజ్ఞతలు చెప్పి ఇన్సల్ట్ చేయవద్దు తమ్ముడు. ఈ ప్రపంచంలో ఉన్నవారంతా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఆ కుటుంబాన్ని కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నా అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.

 తదుపరి చిత్రం

తదుపరి చిత్రం

2018లో మనోజ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆపరేషన్ 2019 చిత్రంలో మాత్రం కామియో రోల్ చేశాడు. మజోజ్ చివరగా నటించిన గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. మనోజ్ తదుపరి చిత్రం గురించి ఇంకా క్లారిటీ రాలేదు. 2019 లో అయినా తన కొత్త చిత్రాన్ని ప్రకటిస్తాడేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X