జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నా ప్రాణాలు అడ్డేస్తా.. మంచు మనోజ్!

మంచు ఫ్యామిలీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. శ్రీ విద్యానికేతన్ సంస్థలకు రావాల్సిన ఫజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం మోహన్ బాబు, ఆయన తనయులు మంచు విష్ణు, మనోజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఎదురెళుతున్నారు. ఈ పోరాటంలో చాలా మంది మంచు ఫ్యామిలీకి మద్దతు తెలుపుతుండగా.. ఇందులో రాజకీయ కోణం ఉందని మరికొందరు విమర్శిస్తున్నారు. తాజాగా మంచు విష్ణు ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించారు. చాలా మంది మీరు చేస్తున్న పోరాటానికి మద్దత్తు తెలుపుతున్నాం అని కామెంట్ చేశారు. మరికొందరు అడిగిన ప్రశ్నలకు మంచు మనోజ్ ఇచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

 నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది

నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది

ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. మనోజ్ అన్నా జనసేనకు మద్దతు తెలపవా అని అడగగా.. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు. టిడిపి నేత కుటుంబ రావు మంచు ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలకు మనోజ్ కౌంటర్ ఇచ్చాడు. ఈ సమయంలో చాలా మంది అభిమానులు మనోజ్ ని సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే

మరో నెటిజన్ మనోజ్ ని ప్రశ్నిస్తూ.. మనోజ్ అన్న చిన్న డౌట్.. ఇప్పుడు నువ్వు ఏపార్టీకైనా మద్దతు ఇవ్వు.. అది నీ ఇష్టం. కానీ 5 లేదా 10 ఏళ్ల తర్వాత తారక్ అన్న రాజకీయాల్లోకి వస్తే ఆయనకు తోడుగా ఉంటావా అని ప్రశ్నించాడు. దీనికి మనోజ్ ఇచ్చిన సమాధానం ఎన్టీఆర్ అభిమానులని ఫిదా చేస్తోంది. తారక్ వస్తే నేను ఎక్కడికి వెళతాను తమ్ముడు.. నా మిత్రుడి రాకకోసం ఎదురుచూస్తున్నా.. తారక్ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తా అని తెలిపాడు. ఎన్టీఆర్ గురించి మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం

ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం

ఇక మంచు ఫ్యామిలీ చంద్రబాబుపై చేస్తున్న విమర్శల విషయానికి వస్తే.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా ఆలస్యం చేస్తోందని, ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందన లేదని మోహన్ బాబు అన్నారు. ఇక విసిగిపోయి విద్యార్థులతో కలసి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు శుక్రవారం మోహన్ బాబు అన్నారు. శుక్రవారం రోజు శ్రీవిద్యానికేతన్ విద్యార్థులతో కలసి మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ ర్యాలీలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

 రాజకీయ కోణం

రాజకీయ కోణం

ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో టీడీపీని ఇబ్బంది పెట్టేందుకే మోహన్ బాబు చంద్రబాబుపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన వైసీపీతో చేతులు కలిపారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. నీవు సత్యహరిశ్చంద్రుడివి కాదు, ధర్మరాజువి కాదు. నా డబ్బు నాకు ఇవ్వు అంటూ మోహన్ బాబు తిరుపతి ర్యాలీలో చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X