దేవుడి ఫోటో చూపిస్తూ మోడీపై అటాక్.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు!
మంచువారబ్బాయి మనోజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. అనేక సామజిక, రాజకీయ అంశాలపై మంచు మనోజ్ తన అభిప్రాయాలని ప్రజలతో పంచుకుంటుంటాడు. ఒక్కడు మిగిలాడు చిత్రం తర్వాత మనోజ్ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. తాజాగా సోషల్ మీడియాలో మనోజ్ ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా మోడీని నిలదీస్తూ మనోజ్ కామెంట్స్ చేశాడు.

కనీసం కృతజ్ఞత కూడా లేదు
ప్రధాని మోడీ గారు.. మీరు చేసిన పోరాటంలో మీ వెంట నడిచాం. మీ అవసరం మాకు ఉన్న సమయంలో 4 ఏళ్లపాటు మీరు ఏదో చేస్తారు అని ఆశించి ఓపికగా ఎదురుచూశాం. కానీ మీరు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేరలేదు. స్పెషల్ స్టేటస్ రాలేదు.. మీరు మాకు కనీసం కృతజ్ఞత కూడా చూపించలేదు అంటూ మనోజ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల విషయంలో మనోజ్ నేరుగా మోడీనే అటాక్ చేశారు.
దేవుడి ఫోటో చూపిస్తూ
మా డిమాండ్ కు మీరు విలువ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాని ప్రకటించాలి అంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో చూపించి మనోజ్ మోడీని నిలదీశారు. శ్రీనివాసుడి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు మీరు హామీ ఇచ్చారు. నిలబెట్టుకోండి. లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మనోజ్ ని ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

ఎవరికి ఏ భాషలో చెప్పాలో
మనోజ్ ట్వీట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇలా కాదు మనోజ్ భయ్యా ఇంకా ఘాటుగా హెచ్చరించి ఉండాల్సింది. ఇంత సాఫ్ట్ గా చెబితే అర్థం కాదు అని కామెంట్ పెట్టాడు. దీనికి మనోజ్ బదులిస్తూ.. ఎవరికి ఏభాషలో చెబితే అర్థం అవుతుందో నాకు తెలుసు అని బదులిచ్చాడు. ఏపీ ప్రభుత్వం, కొన్ని ఎన్జీవో సంఘాలు చిత్ర పరిశ్రమ కూడా ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కొత్త సినిమా కోసం
ఇక సినిమాల విషయానికి వస్తే మనోజ్ నుంచి కొత్త సినిమా ప్రకటన ఇంకా రాలేదు. ఆ మధ్యన తాను మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నానంటూ మనోజ్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. దీనితో కొత్త సినిమా కోసమే మనోజ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమాల్లో సొంతంగా రిస్క్ తో కూడుకున్న స్టంట్స్ చేయడంలో మనోజ్ ముందుంటాడు. యాక్షన్ సన్నివేశాలు బాగా వచ్చేందుకు మనోజ్ ఎంతటి సాహసానికైనా వెనుకాడడు.


Click it and Unblock the Notifications











