twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీరిచ్చిన కూడు తింటూ నేనెక్కడికి పోతానన్నా.. పందులకంటే హీనమా.. మంచు మనోజ్!

    |

    Recommended Video

    Manchu Manoj Amazing Speech At Mohanbabu Birthday Celebrations | Filmibeat Telugu

    కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 69వ జన్మదిన వేడుకలు మార్చి 19 మంగళవారం ఘనంగా జరిగాయి. మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఈ వేడుకలు జరిగాయి. మోహన్ బాబు బర్త్ డే సెలెబ్రేషన్స్ కి ఆయన కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మోహన్ బాబు విలన్ గా, హీరోగా రాణిస్తూ దశాబ్దాల కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మోహన్ బాబు చిన్న కుమారుడు హీరో మంచు మనోజ్ ఈ వేడుకలో విద్యార్థులని ఉత్సాహపరిచే విధంగా, ఆలోచింపజేసే విధంగా సామజిక, రాజకీయ అంశాల గురించి ప్రసంగించారు.

     కొత్త సినిమా కబురు

    కొత్త సినిమా కబురు

    తన తండ్రి మోహన్ బాబుకు బర్త్ డే విషెష్ చెబుతూ మనోజ్ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. హ్యాపీ బర్త్ డే నాన్న.. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేం అని అన్నాడు. నీ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. నాన్న పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తున్నా.. జూన్ నెల నుంచి ప్రారంభం కాబోతోంది అని మనోజ్ తెలిపాడు. మీరిచ్చిన కూడు తింటూ నేనెక్కడికి పోతానన్నా.. మీదగ్గరికే వస్తా అని మనోజ్ తెలిపాడు.మనోజ్ చివరగా నటించిన ఒక్కడు మిగిలాడు చిత్రం విడుదలై చాలారోజులు గడుస్తున్నా కొత్త చిత్రాన్ని ప్రారంభిచలేదు. దీనితో అభిమానుల అనుమానాలు పటాపంచలయ్యేలా మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

     ఎక్కడ చూసినా అరాచకాలు

    ఎక్కడ చూసినా అరాచకాలు

    సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకుందాం.. టెర్రరిస్ట్ అటాక్స్, రాజకీయ హత్యలు, ఆడవాళ్ళ మీద ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయి. వీటన్నింటిని చూస్తే మనకు కోపం వస్తుంది. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాం. రాజకీయ పరంగా అయితే టిడిపికి ఓట్ వేయండి, వైసీపీకి ఓట్ వేయండి, జనసేనకు ఓట్ వేయండి అని పోస్ట్ పెడతాం. మనకు నచ్చిన నాయకుడికి ఓట్ వేయమని అడగడంలో తప్పు లేదు. కానీ మీ నాయకుడు అది, మీ నాయకుడు ఇది అని తిట్టుకోటం ఏంటని మనోజ్ ప్రశ్నించాడు. దీనివలన నెగిటివిటి పెరిగి మన జీవితం కూడా నెగిటివిటీలోనే ముగుస్తుందని అన్నారు.

    రాఘవేంద్ర రావు ఆపిల్‌కు కోట్లల్లో మార్కెట్.. మోహన్ బాబు ప్రతి స్టూడెంట్ జేబులో.. అలీ!రాఘవేంద్ర రావు ఆపిల్‌కు కోట్లల్లో మార్కెట్.. మోహన్ బాబు ప్రతి స్టూడెంట్ జేబులో.. అలీ!

     ఒరేయ్ మనోజా

    ఒరేయ్ మనోజా

    అందుకే ఎక్కువఆ ప్రేమని పంచడానికి ప్రత్నించండి అని మనోజ్ సూచించాడు. ఒరేయ్ మనోజా పక్కవాడు తిడుతుంటే ఎలారా సైలెంట్ గా ఉండేది అని మీరు నన్ను అడగొచ్చు. ఓ కథ చెబుతా. ఇద్దరు అన్నదమ్ముల్లో అన్నకు తాగుడు, దొంగతనం ఇలా అన్ని చెడు అలవాట్లు వచ్చాయి. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి ఇలా వెధవలు మారడానికి సిగ్గులేదు అని ప్రశ్నించారు. మా నాన్న తాగుతాడు..మా అమ్మని హింసిస్తుంటాడు.. సమాజం కూడా ఇలాగే ఉంది. అందుకే ఇలా తయారయ్యా అని సమాధానం ఇస్తాడు.

    మార్పు మనతోనే

    మార్పు మనతోనే

    అతని తమ్ముడు మాత్రం మంచి డాక్టర్ అవుతాడు. మీ అన్న ఒక వెధవలా తయారయ్యారు.. మీరు మాత్రం బాగా చదువుకుని మంచివారుగా జీవిస్తున్నారు.. ఎలా అని ప్రశ్నించగా మా నాన్న, సమాజంలో కొందరు దారుణంగా తయారయ్యారు. నేను మాత్రం అలా కాకూడదు.. మనిషిగా జీవించాలని అనుకున్నా అని తమ్ముడు సమాధానం ఇస్తాడు. మన చుట్టూ ఎంత చెత్త ఉన్నా సరే మన విలువల్ని మనం మరచిపోకూడదు. మనిషిలా ఆలోచించడం మానకూడదు అని మనోజ్ తెలిపాడు. మార్పు మనతోనే మొదలవ్వాలి అని కోరాడు.

     పందులకంటే హీనమా

    పందులకంటే హీనమా

    ఇక మనోజ్ ఓటు హక్కు ప్రాముఖ్యతని వివరించాడు. ఈ మధ్యనే కొన్ని జంతువుల ధరలు మార్కెట్ లో తెలుసుకున్నా. మంచి గేదె దాదాపుగా 80 వేల ధర పలుకుతుంది. మేక 8 వేల వరకు ఉంటుంది. పంది ధర 3 వేలు నుంచి 5 వేలు. ఓటు ధర 500 నుంచి 5000 వేలు అని మనోజ్ అన్నాడు. అంటే మనం పందులకంటే హీనమా అని ప్రశ్నించాడు. డబ్బుకు అమ్ముడుపోయి ఓటు వేయొద్దని మనోజ్ కోరాడు.

    English summary
    Manchu Manoj speech at Mohan Babu Birthday Celebrations
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X