కష్టాల్లో పవన్ కళ్యాణ్ అభిమాని.. ముందుపడ్డ మంచు మనోజ్.. మెగా ఫ్యాన్స్ ఫిదా

Recommended Video

Manchu Manoj Helps Pawan Kalyan Fan || హ్యాట్స్ ఆఫ్ మంచు మనోజ్

మెగా అభిమానుల్లో జోష్ నింపుతూ అందరి చేత ప్రశంసలందుకునే పని చేశాడు మంచు మనోజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానికి వచ్చిన కష్టంపై స్పందించి నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు. దీంతో పవన్ అభిమానులు, జనసేన పార్టీ వర్గాలు మంచు వారబ్బాయిపై ప్రశంసలు గుప్పిస్తున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది? మంచు మనోజ్ ఏం చేశాడు? వివరాల్లోకి పోతే..

ఈ మధ్యకాలంలో మంచు వారబ్బాయి

ఈ మధ్యకాలంలో మంచు వారబ్బాయి

సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్.. ఈ మధ్యకాలంలో మరింత యాక్టివ్ అయ్యాడు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంచుకుంటూ ఆన్‌లైన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యం లోనే పవన్ అభిమాని చేసిన రిక్వెస్ట్ పై వెంటనే స్పందించి భేష్ అనిపించుకున్నాడు.

ఆర్ధిక స్థోమత లేకపోవడంతో పవన్ అభిమాని

ఆర్ధిక స్థోమత లేకపోవడంతో పవన్ అభిమాని

పవన్ కళ్యాణ్ అభిమాని అయిన సాయినాథ్ కల్యాణ్ అనే వ్యక్తికి ఓ కష్టం వచ్చింది.ఆ కష్టం తీరేంత ఆర్ధిక స్థోమత అతని దగ్గర లేకపోవడంతో.. ఈ కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, జేడీ లక్ష్మీనారాయణ, మంచు మనోజ్ లకు ట్యాగ్ చేశాడు. ఈ మేరకు తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానినని తెలిపాడు.

తండ్రికి చాలా సీరియస్‌గా ఉండటంతో

తాను ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కోసం కూడా తిరిగానని పేర్కొన్న సాయినాథ్.. తనకు పవన్ అంటే ప్రాణమని, ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని తెలిపాడు. ప్రస్తుతం తన తండ్రికి చాలా సీరియస్‌గా ఉందని, తన తండ్రికి జరిగిన ప్రమాదం కారణంగా కోమాలో ఉన్నాడని, తన దగ్గర వైద్యం చేయించుకునేంత ఆర్థిక స్థోమత లేదు కాబట్టి దయచేసి సహాయం అందించండి అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు ఆ సాయినాథ్ అనే వ్యక్తి.

ముందుపడ్డ మంచు మనోజ్

ముందుపడ్డ మంచు మనోజ్

అయితే సాయినాథ్ చేసిన ట్వీట్ చూడగానే వెంటనే స్పందించాడు మంచు మనోజ్. నీ వివరాలు పంపు స్వామి.. మా వాళ్లు నీ దగ్గరికి వచ్చి కలుస్తారు.. ధైర్యంగా ఉండు మీ నాన్నకు ఏం కాదంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో సాయినాథ్ సహా అతని కుటుంబ సభ్యులు, మెగా అభిమానులు మంచు మనోజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X