డైరక్టర్, నేనూ సినిమా కోసం పెళ్ళి కూడా ఆపుకున్నాం
దర్శకుడు రాజశేఖర్ రాజు ఈ చిత్రం కోసం తన పెళ్లి కూడా ఆపుకొన్నాడు. నాక్కూడా ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ సినిమా అయ్యేంత వరకు పెళ్లి వూసే ఎత్తొద్దని చెప్పాను అంటున్నాడు మంచు మనోజ్. ఆయన తమ సొంత బ్యానర్ లో త్వరలో మొదలుకానున్న చిత్రం 'వూఁ కొడతారా ఉలిక్కిపడతారా' గురించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.అలాగే 'వూఁ కొడతారా ఉలిక్కిపడతారా' నాకు ప్రాణంతో సమానం. ఆ సినిమా కోసం గత మూడేళ్లుగా కష్టపడుతున్నా. 19, 20 శతాబ్దాలకు సంబంధించిన కథ అది. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ తదితర విషయాలకు కూడా దూరంగా ఉంటూ కష్టపడుతున్నా. ఒక్కొక్క సన్నివేశం గురించి ఒక్కో పుస్తకం రాసేలా ఉంటుంది ఈ చిత్రం. దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఆలోచన ఉంది. అలాగే అని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మిస్టర్ నోకియా' కూడా భిన్నమైన కథాంశమే. ఈ చిత్రం కోసం నేనొక పాట రాశా అన్నాడు.


Click it and Unblock the Notifications











