Manchu Manoj: ప్రేయసిని పెళ్లాడిన మనోజ్.. ఆయనను పట్టుకుని ఏడ్చిన మౌనిక.. మోహన్ బాబుకు ఇష్టమేనా అంటే!
కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి వార్త ఒకటి. రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి భూమా మౌనిక రెడ్డితో అతడు ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ వివాహం మోహన్ బాబుకు ఇష్టం లేదని కూడా గుసగుసలు వినిపించాయి. దీంతో ఇది సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు మనోజ్ తన ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసమే!

సుదీర్ఘ కాలంగా ప్రేమాయణం
మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో చాలా కాలం ప్రేమాయణం సాగించి 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు. అప్పటి నుంచి అతడికి ఫ్యామిలీ ఫ్రెండ్ భూమా మౌనిక రెడ్డి (ఆమెకు కూడా విడాకులు అయ్యాయి) బాసటగా నిలిచింది. అలా వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు.

వివాహ పెద్దగా మారిన సోదరి
మంచు మనోజ్ రెండో పెళ్లిపూ ప్రచారాలు జరుగుతోన్న సమయంలోనే అతడు భూమా మౌనిక రెడ్డితో కలిసి గణేష్ మండపంలో ప్రత్యేకంగా పూజలు చేస్తూ కనిపించాడు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. అందుకు అనుగుణంగానే వీళ్లు పెళ్లికి రెడీ అయ్యారు. దీంతో మనోజో సోదరి మంచు లక్ష్మి అన్నీ తానై చూసుకుంటూ పెళ్లి పెద్దగా మారిం

ప్రియురాలితో మనోజ్ పెళ్లి
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ తన ప్రియురాలు భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నాడు. పెద్దలు నిశ్చయించిన ముహూర్తం ప్రకారం శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఆమె మెడలో తాళి కట్టాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు రెండు ఫ్యామిలీలకు చెందిన సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

మంచు లక్ష్మి ఇంట్లోనే పెళ్లి
మంచు మనోజ్ అంటే సోదరి లక్ష్మీ ప్రసన్నకు చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అందుకే ఆమె అతడి రెండో పెళ్లిని తన ఇంట్లోనే జరిపాలని డిసైడ్ అయ్యారు. అందుకు అనుగుణంగానే హైదరాబాద్‌లోని తన నివాసంలోనే మనోజ్ పెళ్లిని జరిపించారు. పెళ్లి కూతురు మౌనికకు తల్లిదండ్రులు లేని కారణంగానే మంచు లక్ష్మి ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.

సెలెబ్రిటీల రాకతో హ్యాపీగా
హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో అంగరంగ వైభవంగా జరిగిన మంచు మనోజ్ - భూమా మౌనిక రెడ్డి వివాహానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అందులో నిక్కీ గర్లానీ, శివ బాలాజీ దంపతులు, కోదండ రామిరెడ్డి, పరచూరి గోపాలకృష్ణ, వైఎస్ విజయమ్మ సహా ఎందరో వీళ్లను ఆశీర్వదించారు.

మోహన్ బాబు ఇష్టంతోనేనా
మంచు మనోజ్ రెండో పెళ్లి వార్త వైరల్ అవుతోన్న సమయం నుంచే ఇది అతడి తండ్రి మోహన్ బాబుకు ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే, నిన్న జరిగిన పెళ్లికి మోహన్ బాబు కూడా హాజరై ఆ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు. ఇక, మామను హత్తుకుని మౌనిక కన్నీటి పర్యంతం అయింది. అలాగే, విష్ణుతో పాటు ఫ్యామిలీ మొత్తం వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించింది.

మనోజ్ కెరీర్ సాగుతుందిలా
మనోజ్ ఆ మధ్య 'అహం బ్రహ్మాస్మి' అనే కొత్త తరహా చిత్రాన్ని ప్రకటించాడు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ఎమ్ ఆర్ట్స్ పతాకంపై మంచు ఫ్యామిలీలోని వాళ్లంతా స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే, ఇటీవలే 'What The Fish' అనే పాన్ ఇండియా ప్రాజెక్టును కూడా ప్రకటించాడు. త్వరలోనే ఇది మొదలు కాబోతుంది.


Click it and Unblock the Notifications











