యాక్షన్ కొరియోగ్రాఫర్ గా...మంచు మనోజ్
ఈ విషయమై మనోజ్ తన ట్విట్టర్లో స్పందిస్తూ... " పోటు గాడు సినిమాకు స్టంట్ మాస్టర్స్ నేనూ,రాంబాబు, ఇంగ్లీష్ మాస్టర్ స్టీఫెన్ ఫైట్స్ కంపోజ్ చేయటం లేదు.. :-) కేవలం ఇది క్లారిటీ కోసమే...:) ," అన్నారు. ప్రస్తుతం 'పోటుగాడు' షూటింగ్ కర్నాటకలోని బీజాపూర్లో జరుగుతోంది.
రెండు నెలల పాటు ఇక్కడే షూటింగ్ జరుపనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. మార్చి 21న ఈచిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం జరుగగా ఏప్రిల్ 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. కన్నడ దర్శకుడు పవన్ వడెయార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, లగడపాటి శ్రీధర్ ఈచిత్రాన్ని రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.
ఆసక్తికర విషయం ఏమిటంటే ఈచిత్రంలో నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారు. సాక్షి చౌదరి, సిమ్రాన్ ముండి, నథాలియా కౌర్ నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం తర్వాత మనోజ్ చేస్తున్న సినిమా ఇదే. అలాగే ఈ చిత్రం గోవిందాయమహ అనే కన్నడ చిత్రానికి అఫీషియల్ రీమేక్.


Click it and Unblock the Notifications












