twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వార్త విని షాకయ్యాను: కోడెల మరణంపై మంచు మనోజ్

    |

    తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన కోడెల శివప్రసాద్ రావు మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్‌కు గురి చేసింది. కొంతకాలంగా రాజకీయ ఒత్తిడితో సతమతం అవుతున్న కోడెల సోమవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

    కోడెల మరణంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మంచు మనోజ్ ఈ విషయమై రియాక్ట్ అవుతూ... 'మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి మరణ వార్త విని షాకయ్యాను. ఆయన ఒక గొప్ప నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపం, వారికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు.

    గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన కోడెల శివప్రసాదరావు జన్మించాడు. 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు.

    Manchu Manoj tweet about Kodela Siva Prasad death

    ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలై, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశాడు. కోడెల మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    "Shocked to hear the news of great leader, former speaker #KodelaSivaPrasad garu's demise. Rest in peace sir 🙏🙏🙏 My condolences to his family members. May God give much strength to them." Manchu Manoj tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X