‘మింగిచావ్’... మంచు మనోజ్ ట్వీట్ హాట్ టాపిక్!
టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ తన ట్విట్టర్లో పోస్టు చేసిన ఓ ఫోటో హాట్ టాపిక్ అయింది. ఓ తెలుగు వ్యక్తి ప్రారంభించిన చైనీస్ రెస్టారెంటుకు పెట్టిన పేరు మనోజ్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అతడి క్రియేటివిటీకి హాట్సాఫ్ చెబుతూ మనోజ్ ఈ పోస్టు పెట్టారు.
'మింగిచావ్' అనేది చైనీస్ పదంలా కనిపిస్తున్నప్పటికీ... ఇది పక్కా తెలుగు పదం. మింగి చావు (తిను అని అర్థం) అనేది పదం తరచూ తెలుగులో వినిపిస్తూనే ఉంటుంది. ఇలా చైనీస్ తెలుగు రెండు రకాల అర్థాలు వచ్చేలా రెస్టారెంట్ పేరు పెట్టడం మనోజ్‌కు ఎంతో నచ్చేసింది.
మంచు మనోజ్ సినిమాల విషయానికొస్తే ఆయన నటించిన చివరి చిత్రం 'ఒక్కడు మిగిలాడు' గతేడాది విడుదలైంది. ఆ సినిమా తర్వాత మనోజ్ ఏ మూవీకి కమిట్ కాలేదు. అయితే త్వరలోనే ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మనోజ్ తెలిపారు.

తన తర్వాతి చిత్రం ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని, ఆగస్టులో ఇందుకు సంబంధించిన షూటింగ్ మొదలవుతుందని... మనోజ్ ఇటీవల ట్విట్టర్ చాట్లో అభిమానులకు వెల్లడించారు. అయితే అందుకు సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు.


Click it and Unblock the Notifications











