twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎందుకీ మౌనం? వివాదంలోకి రామ్ చరణ్, మంచు మనోజ్.... అదిరిపోయే కౌంటర్!

    |

    కొంత కాలంగా శబరిమలలోని అయ్యప్పస్వామి టెంపుల్ విషయంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ దేవాలంలోకి మహిళలను సైతం అనుమతించాలంటూ సుప్రీం కోర్టు తీర్పు నివ్వడం, దీన్ని భక్తులు వ్యతిరేకిస్తుండటం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

    దైవత్వం, మతానికి సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో ప్రముఖులు ఎవరూ స్పందించడం లేదు. ఈ విషయంలో ఏం మాట్లాడినా ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో దీనిపై అప్పయ్య భక్తులైన సినీ ప్రముఖులు సైతం మౌనంగానే ఉంటున్నారు. గతంలో తెలుగు స్టార్స్ రామ్ చరణ్, మంచు మనోజ్ అయ్యప్ప దీక్షలు చేపట్టిన నేపథ్యంలో ఓ నెటిజన్ వారిని ప్రశ్నించాడు.

    శబరిమలను కాపాడండి, నోరు విప్పండి

    శబరిమలను కాపాడండి, నోరు విప్పండి

    శబరిమల దేవాలయం వివాదం విషయంలో ఇప్పటికైనా స్పందించండి, శబరిమలను కాపాడండి అంటూ ఓ నెటిజన్ కోరాడు. రామ్ చరణ్, మంచు మనోజ్ అయ్యప్ప దీక్ష చేపట్టిన ఫోటోలను ఫోస్ట్ చేసి వివాదంపై స్పందించాలని కోరారు.

    అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మనోజ్

    అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మనోజ్

    ఈ వివాదంపై మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మనోజ్ ఇచ్చిన సమాధానంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అయ్యప్ప భక్తులు మాత్రం ఆయన సరైన సమాధానం ఇస్తే బావుంటుంది అని అభిప్రాయపడుున్నారు. ఇంతకీ మనోజ్ ఏం చెప్పారంటే...

    ముందు మనం ఆ విషయం ఆలోచించాలి

    ముందు మనం ఆ విషయం ఆలోచించాలి

    ముందు మనం పేద ప్రజలకు ఆహారం, మంచి నీరు, విద్య అందుతుందా.. లేదా? అనే విషయం ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ అన్ని విషయాలకంటే ముందు ఈ విషయం గురించి వర్రీ అవ్వాలి... అని మనోజ్ వ్యాఖ్యానించారు.

    ఈ విషయాన్ని రెస్పెక్టుతో చెబుతున్నాను

    ఈ విషయాన్ని రెస్పెక్టుతో చెబుతున్నాను

    మనం దేవిడిని నమ్ముతున్నపుడు.. ఆయన సమస్య ఆయనే పరిష్కరించుకుంటాడనే విషయాన్ని కూడా నమ్మాలి. ఈ విషయాన్ని చాలా రెస్పెక్టుతో చెబుతున్నాను... అని మంచు మనోజ్ స్పష్టం చేశారు.

    మానవత్వం వైపు నిలబడండి

    మనం అందరం అన్నింటికంటే ముందుగా హ్యూమానిటీ వైపు నిలబడాల్సిన అవసరం ఉంది. లవ్ యూ ఆల్.... అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

    English summary
    "We r worried about Food Water and Education for poor and we all shud worry about that First ... Well when we believe in God, Then let’s believe that he can Solve His Problems by Himself 🙏🏻🙏🏻 ... Telling this With all Due Respect .. ❤️❤️ Let’s Stand For #Humanity Love u all." Manchu Manoj tweeted about Sabarimala Controversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X