»   » ట్వీట్ తో మంచు మనోజ్ ఓ రేంజిలో రచ్చ

ట్వీట్ తో మంచు మనోజ్ ఓ రేంజిలో రచ్చ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: "అందరూ వద్దనుకున్న ఓ రాజకీయనాయకుడు టాప్ లీడర్ ఎలా అవుతాడు...ఎవరో కేంద్రం నుంచి ఒక్క నాయకుడు మనతో ఇలా ఫుట్ బాల్ ఆడుతూంటే బాధగా ఉంది. మనందరం కేవలం కూర్చుని టీవి పోగ్రాంలా చూస్తున్నాం. అసలు వీళ్లు రాజకీయ నాయకులేనా..ఎవరనేది పేరు చెప్పక్కర్లేదు:) " అంటూ ఆవేశంగా మంచు మనోజ్ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కు ఓ రేంజిలో స్పందన వచ్చింది. ట్విట్టర్ లోనూ దీనికి చాలా మంది అనుకూలంగానూ,ప్రతికూలంగానూ స్పందించారు.

ఇక ఈ ట్వీట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ చిరంజీవిని ఉద్దేశించే అని మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం విభజనాంతరం జరుగుతున్న రాజకీయపరిణామాల్లో చిరంజీవి సీఎం అయ్యే పరిస్ధితులు కనపడుతున్నాయంటూ విశ్లేషణలు వస్తున్న ఈ సమయంలో ఈ ట్వీట్ రావటం అందరినీ ఆలోచనలో పడేసింది.

Manchu Manoj tweet satire on Mega Star Chiranjeevi

పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో హిట్ కొట్టి ఉత్సాహంలో ఉన్న మంచు మనోజ్ తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నాడు. ఈ చిత్రం టైటిల్ సన్నాఫ్ పెద రాయుడు. ఫిబ్రవరి ఆరు నుంచి చిత్రం ప్రారంభం కానుంది. మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుందని చెప్తున్నారు.

మోహన్‌బాబు కెరీర్‌లో కలికితురాయి లాంటి సినిమా 'పెదరాయుడు'.బాక్సాఫీస్‌ వద్ద సంచలన వసూళ్లను సాధించిన గొప చిత్రమిది. అంతేకాదు డైలాగ్‌కింగ్‌ని ఓ రేంజులో చూపించారీ చిత్రంలో. ఈ సినిమాకి సీక్వెల్‌ 'సన్నాఫ్‌ పెదరాయుడు'.కొత్త దర్శకుడు సాగర్‌ పసల దర్శకత్వం వహిస్తారని, అమెరికా షెడ్యూల్‌ మొదలవుతోందని తెలుస్తోంది. ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

English summary
Manchu Manoj tweeted : “I have question for all of us:) well How to become a top politician even after people rejecting ??? Pl answer practically :) .“It doesn’t matter who … I’m just asking because I’m one among u who is confused with the way things r going …Can’t believe one politician from center playing with our life left right centre. All we r doing is sit and watch like its a tv program..”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu