‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ మనోజ్ ఫస్ట్‌లుక్
హీరో మంచు మనోజ్ త్వరలో 'ఊకొడతారా ఉలిక్కిపడతారా' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకు వచ్చింది. మీరు పక్కన చూస్తున్నది అదే. మనోజ్ ఇలా స్టయిలిష్ గా కనిపించడాన్ని చూస్తుంటే సినిమా గతంలో వచ్చిన మనోజ్ సినిమాల కంటే కూడా చాలా స్టయిలిస్ గానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇందులో బాలయ్య జమిందార్ నరసింహ రాయుడుగా కనిపించనున్నారు. దాదాపు రెండు నెలల క్రితమే సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వగా.... అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో బాలయ్య, సోనూసూద్, బాను చందర్ లపై పలు సీన్లు చిత్రీకరించారు.
మంచు లక్ష్మి ప్రసన్న మంచు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చితానికి కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం శేఖర్ రాజ. బెబో శశి సంగీతం అందిస్తున్నారు. బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











