ఇదో వెరైటీ....మనోజ్, వరుణ్ సందేశ్ కాంబినేషన్
మంచు మనోజ్, వరుణ్ సందేశ్ కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రాన్ని రూపొందనుంది. పందెం కోడి హీరో విశాల్ సొంత బ్యానర్ జి.కె.ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థ ఈ నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. విశాల్ తో కిలాడి చిత్రం రూపొందించిన తిరు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. ఈ సందర్భంగా విశాల్ సోదరుడు నిర్మాత విక్రమ్ కృష్ణ మాట్లాడుతూ 'దర్శకుడు తిరు ఓ మంచి ప్రేమకథను మాకు వినిపించారు. ఆ కథ మాకు బాగా నచ్చింది. ఇద్దరు యువకులు, ఓ యువతి మధ్య జరిగే ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది. ఇందులో హీరోలుగా మంచు మనోజ్, వరుణ్ సందేశ్ నటిస్తారు. ఓ ప్రముఖ హీరోయిన్ నటిస్తుంది. మిగిలిన తారాగణం వివరాలు త్వరలో వెల్లడిస్తాం. డిసెంబర్ లో పది రోజుల పాటు తొలి షెడ్యూల్ జరుగుతుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో టాకీని, మార్చిలో విదేశాల్లో పాటలను చిత్రీకరిస్తాం' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాణసారథ్యం: వడ్డి రామానుజం, నిర్మాత: విక్రమ్ కృష్ణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు.


Click it and Unblock the Notifications











