»   » మంచు మనోజ్ వెడ్డింగ్ కార్డ్ (ఫోటోస్)

మంచు మనోజ్ వెడ్డింగ్ కార్డ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో మనోజ్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. మనోజ్ నిశ్చితార్థం ప్రణతి రెడ్డితో మార్చి 4న జరిగింది. ఇక వీరి వివాహానికి పురోహితులు మే 20వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం జరగనుంది. మరో విశేషం ఏంటంటే మనోజ్ పుట్టిన రోజు కూడా మే 20వ తేదీయే. ప్రణతి రెడ్డిని మనోజ్ ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు.

ఈ వివాహానికి పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే మంచు ఫ్యామిలీ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి శుభలేఖ అందజేసారు. మరో వైపు విష్ణు స్వయంగా వెళ్లి మహారాష్ట్ర గవర్నర్, తెలుగువాడైన విద్యాసాగర్ రావునుకూడా ఆహ్వానించారు.

పలువురు ప్రముఖులను మంచు ప్యామిలీ మెంబర్స్ స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. వివాహానికి సంబంధించిన శుభలేఖ ప్రత్యేకంగా తయారు చేయించారు. శుభలేఖ చాలా బావుందని ప్రధాని మోడీ కూడా ప్రశంసించారు కూడా. మనోజ్ కు సంబంధించిన ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ పై మీరూ ఓ లుక్కేయండి.

కోడలు

కోడలు

కాబోయే కోడలి గురించి మోహన్ బాబు స్వయంగా వెల్లడించారు ''మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి ఇద్దరూ క్లాస్ మెట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులకూ, మా కుటుంబానికీ పరిచయం ఏర్పడింది అని తెలిపారుస.

చార్టెడ్ అకౌంటెంట్

చార్టెడ్ అకౌంటెంట్

ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. ఆ తర్వాత న్యూయార్క్ లో సీపీఎ (అమెరికాలో చార్టెడ్ ఎకౌంటెంట్ ని సిపీఎ అంటారు) చేసింది.

అభిమానుల ఆశీస్సులతో

అభిమానుల ఆశీస్సులతో

అభిమానులు, శ్రేయోభిలాషులు ఆశీస్సులతో ఈ పెళ్లి జరుగుతుంది'' అని మోహన్ బాబు అన్నారు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

మనోజ్-ప్రణతి ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఇద్దరికి చాలా కాలంగా పరిచయం ఉంది.

ప్రముఖులు

ప్రముఖులు

ఈ వివాహానికి పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.

ముహూర్తం

ముహూర్తం

వివాహానికి పురోహితులు మే 20వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు.

బర్త్ డే

బర్త్ డే

మనోజ్ పుట్టిన రోజు కూడా మే 20వ తేదీయే....ఇదే వేడుకపై మనోజ్ పుట్టినరోజు వేడుక జరుగనుంది.

English summary
Check out Manchu Manoj wedding card.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu