సీనియర్ ఎన్టీఆర్ చేసిన పాత్రలో మంచు మనోజ్
హైదరాబాద్: నర్తనశాల చిత్రంలో సినియర్ ఎన్టీఆర్ బృహన్నల పాత్రలో ఏ రేంజిలో అదరగొట్టారో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇపుడు టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కూడా అలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు. మంచు ఫ్యామిలీ మల్టీ స్టారర్ 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో మనోజ్ ఈ పాత్ర పోషించబోతున్నారట.
ఎన్టీఆర్ లాంటి మహానటుడు చేసిన పాత్ర కాబట్టి దీన్ని చాలెంజింగ్‌గా తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాడట మనోజ్. తన పాత్రకు లేడీ వాస్ డబ్బింగ్ కూడా మనోజే చెప్పుకోబోతున్నాడని సమాచారం. మొత్తానికి ఈ చిత్రంలో మనోజ్ చీరకట్టుతో ప్రేక్షకులను అలరించబోతున్నారన్నమాట.
శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. త్వరలో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బ్రహ్మానందం, ఎంఎస్.నారాయణ, అలీ, రఘుబాబు, గుర్లిన్ చోప్రా, అలేఖ్యవర్మ, తెలంగాణ శకుంతల, గిరిబాబు, పోసాని కృష్ణ మురళి, కాశీ విశ్వనథ్, కృష్ణ భగవాన్, సుప్రీత్, భరణి, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.


Click it and Unblock the Notifications












