తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడమే ఆ హీరో లక్ష్యం..!

By Sindhu

ఏ ఆర్టిస్టుకైనా లక్ష్యం 'హీరో'గా చేయాలన్నదే. క్యారెక్టర్ ఆర్టిస్టుని అడిగినా కూడా 'హీరో'గానే చేస్తానంటాడు. అయితే, మోహన్ బాబు తనయుడు మనోజ్ కి మాత్రం అలాంటి నియమాలేవీ లేవట. క్యారెక్టర్ నచ్చాలే కానీ, అది ఎలాంటిదైనా సరే చేసేస్తానంటున్నాడు. "కామెడీ...విలనీ... ఏదైనా సరే... నేను రెడీ... అసలు మీకో విషయం చెప్పాలి. సునీల్ హీరోగా, నేను విలన్ గా ఓ చిత్రం చేయాలన్నది నా కోరిక. ఎవరైనా మంచి స్క్రిప్ట్ తెస్తే నేను రెడీ'. అంటున్నాడు. గతంలో వరుణ్ సందేశ్ హీరోగా ఓ సినిమాలో మనోజ్ నటించాల్సి వున్నా, ఆ సినిమాలో తన పాత్రను మొదట చెప్పినదానికన్నా భిన్నంగా మాచ్చేయడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నానని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మనోజ్ ఆ సినిమాలో నెగటివ్ రోల్ లో కన్పించాల్సి వుంది. ఈ సంఘటన మనోజ్ ని తీవ్ర ఆవేదనకు గురిచేసిందట. అందుకే, తన సొంత బ్యానర్ లోనే మనోజ్ నెగెటివ్ రోల్ లో కన్పించాలని పిక్సయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తను చేస్తున్న 'మిస్టర్ నోకియా' సినిమా తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ సినిమా చేస్తున్నాననీ, దాని పేరు 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా?' అనీ చెప్పాడు. ఈ సినిమా తెలుగు చిత్రరంగంలో ఓ గొప్పమలుపు తెస్తుందని ధీమాగా చెబుతున్నాడు మనోజ్. ఇందులో ఓ సూపర్ స్టార్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తాడని చెప్పాడు. సో నెగటివ్ రోల్స్ తో కెరీర్ ని ప్రారంభించి, నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న మోహన్ బాబు బాటలోనే మనోజ్ కూడా పయనిస్తుండడం ఆహ్వానించదడ్డ పరిణామమే. ఈ రోజు మనోజ్ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీడియాకు ఈ విశేషాలు చెప్పాడు. సో మనోజ్ కి దట్స్ తెలుగు తరపున 'బర్త్ డే విషెస్" అందజేద్దాం...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X