'ఎవ్వడే పిస్తా'? అంటూ రెచ్చిపోయిన మంచు మనోజ్
ఇన్నాళ్లూ హీరోగానే కనిపించిన మంచు మనోజ్ ఇప్పుడు పాటల రచయితగా కూడా అలరించబోతున్నాడు. 'ఎవ్వడే నిన్ను కన్న పిస్తా, దొరికితే కోటింగ్ ఇస్తా..' అంటూ సాగే ఓ పాటను,మరో పాటను ఆయన తాజా చిత్రం 'మిస్టర్ నోకియా'కోసం రాసేసారు. ఈ విషయాలను ఆయన మీడియాకు తెలియచేస్తూ మంగళవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇక ఈ చిత్రం కథ గురించి చెప్తూ మనోజ్... ''సరదాగా కాలం గడిపేసే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది. అతని భుజాన ఓ గురుతర బాధ్యత పడింది. ఓన్లీ యాక్షన్... అంటూ దాన్ని తనదైన శైలిలో చక్కబెట్టాడు. అదెలాగన్నదే చిత్రం'' అన్నారు.
దర్శకుడు అని మాట్లాడుతూ ''వినోదం, యాక్షన్ కలగలిసిన ఒక కొత్త తరహా చిత్రమిది. తాళ్లు, తీగెల సహాయం లేకుండా మనోజ్ చేసిన పోరాట సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇందులో ఆయన రెండు పాటలు కూడా రాశారు. 'ఎవ్వడే నిన్ను కన్న పిస్తా, దొరికితే కోటింగ్ ఇస్తా..' అనే పాట తప్పకుండా యువతను ఉర్రూతలూగిస్తుందని మా నమ్మకం'' అన్నారు. నిర్మాత డీఎస్ రావు మాట్లాడుతూ... ''సాంకేతికంగా ఉన్నత విలువలతో దీన్ని తీర్చిదిద్దుతున్నాం. మనోజ్ ప్రతిభను పూర్తిస్థాయిలో చూపించే చిత్రంగా ఇది నిలుస్తుంద''న్నారు. సనాఖాన్, కృతికర్బందా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజశేఖర్, సంగీతం: యువన్‌శంకర్‌రాజా. సంక్రాంతికి ఈ చిత్రంలోని పాటలు విడుదలవుతాయి.


Click it and Unblock the Notifications











