షాక్‌లో మంచు ఫ్యామిలీ.. కన్నీరు మున్నీరుగా విలపించిన విష్ణు భార్య!

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైఎస్ జగన్ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం ఉదయం వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందారు. మొదటి గుండె పోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన మృత దేహం రక్తపు మడుగులో ఉండడం, శరీరంపై గాయాలు ఉండడంతో వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరో హత్య చేశారనే అనుమానాలు బలపడ్డాయి. ఈ సాయంత్రం వివేకానందరెడ్డి మృత దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వైఎస్ వివేకానందరెడ్డి మృతి హత్యే అని వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా వివేకానందరెడ్డి మృతితో మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

షాక్‌లో వైఎస్ ఫ్యామిలీ

షాక్‌లో వైఎస్ ఫ్యామిలీ

పదేళ్ల క్రితమే తండ్రిని కోల్పోయిన జగన్ కు ఇది మరో షాక్ అని చెప్పాలి. ఊహించని పరిణామాల మధ్య తన బాబాయ్ మరణించడంతో జగన్ సహా విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులంతా కుప్పకూలిపోయారు. వైఎస్ ఫ్యామిలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సరిగ్గా ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఈ వివేకానందరెడ్డి హత్య జరగడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఇదిలా ఉండగా సినీనటుడు మోహన్ బాబు కుటుంబం కూడా వివేకానందరెడ్డి మరణంతో షాక్ కి గురయ్యారు. వైఎస్ ఫ్యామిలీతో మోహన్ బాబు కుటుంబానికి అనుబంధం ఉంది.

 నివాళులర్పించిన మోహన్ బాబు

నివాళులర్పించిన మోహన్ బాబు

కొద్ది సేపటి క్రితమే మోహన్ బాబు, మంచు విష్ణు దంపతులు వివేకానందరెడ్డి మృత దేహానికి నివాళులు అర్పించారు. మోహన్ బాబు.. వివేకానందరెడ్డి మృతదేహాన్ని చూస్తూ దీనంగా ఉండిపోయారు. ఆయన పక్కనే మంచు విష్ణు, అతడి భార్య విరానిక ఉన్నారు. వివేకానందరెడ్డి హత్య గురించి మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ అరాచకాలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ అని ప్రశ్నించారు. పైనుంచి భగవంతుడు అన్ని చూస్తూనే ఉంటాడు. వేరే పార్టీల వాళ్ళు కూడా వివేకానందరెడ్డి అజాత శత్రువు, ఎవరికీ హాని తలపెట్టని వ్యక్తి అని నాతో చెప్పారు అని మోహన్ బాబు అన్నారు.

తొక్కిపెట్టేయకండి

తొక్కిపెట్టేయకండి

వివేకానందరెడ్డి హత్య కేసుని పోలీసులు పారదర్శకతతో దర్యాప్తు చేయాలని అన్నారు. నిజాలు తొక్కిపెట్టేయకుండా, ఎవరో ఎదో అంటూ అసత్యాలు బయటకు ప్రచారం చేయకుండా దర్యాప్తు చేయాలని మోహన్ బాబు అన్నారు. ఇంత క్రూరంగా ప్రవర్తించిన ఆ రాక్షసుడిని తొందర్లోనే పట్టుకుని శిక్షించాలని మోహన్ బాబు అన్నారు. నేను పోలీస్ వారిని వేడుకుంటున్నా అని అన్నారు. నాకు బంధువు, ఆత్మీయుడు అని చెప్పడం లేదు.. ఇక ఏ వ్యక్తికి ఇలా జరగకూడదు అని మోహన్ బాబు అన్నారు.

మంచు విష్ణు భార్య కన్నీరు మున్నీరుగా

మంచు విష్ణు భార్య కన్నీరు మున్నీరుగా

మంచు విష్ణు సతీమణి విరోనిక వైఎస్ కుటుంబానికి బంధువు. వైఎస్ వివేకానందరెడ్డి ఆమెకు చిన్నాన్న అవుతారు. వివేకానందరెడ్డి మృత దేహం వద్ద విరోనిక కన్నీరు మున్నీరుగా విలపించింది. కొద్ది రోజుల క్రితమే విరోనిక తన భర్త మంచు విష్ణుతో కలసి వైఎస్ జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X