Don't Miss!
- Sports
రియాన్ పరాగ్ ఫీల్డింగ్ మస్తుందిగా.. అతని జోష్ అదిరిపోయిందన్న శ్రీలంకన్ స్టార్
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెండేళ్ల పదవా? మా అధ్యక్ష పదవి చిన్న ఉద్యోగమా? చిరంజీవిపై మోహన్ బాబు పరోక్ష సెటైర్లు
మూవీ ఆర్టిస్టు ఎన్నికల తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు మంచు కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఈ వేడుకలో మోహన్ బాబు మంచు మాట్లాడుతూ అందరూ కలిసి మెలిసి ఉండాలి అంటూనే మెగాస్టార్ చిరంజీవిపై పరోక్షంగా కామెంట్లు చేశారు. మా ఎన్నికల రోజున పెళ్లి సందడి ఫంక్షన్లో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ... రెండేళ్ల పదవికి ఇంత దిగజారాలా? దీని కోసం ఒకరు మరొకరు తిట్టుకోవాలా? మీడియాకు ఆహారం కావాలా అంటూ కామెంట్లు చేశారు. తాజాగా మోహన్ బాబు మాట్లాడుతూ..

చిన్న ఉద్యోగం కాదని తెలియదా?
రెండేళ్లపాటు సాగే పదవి, చిన్న ఉద్యోగం అంటూ కొందరు వ్యాఖ్యలు చేయడం తప్పు. చిన్న ఉద్యోగం గురి మీకు తెలియదా? నెల రోజులపాటు కొనసాగే ఉద్యోగం కాదు, చిన్న ఉద్యోగం కాదు.. నటీనటులకు సంబంధించిన బాధ్యతాయుతమైన కళాకారుల కుర్చీ. మహామహులు స్థాపించిన సంస్థకు సంబంధించిన కుర్చీ. కాబట్టి ఆ కుర్చిలో కూర్చొన్న వ్యక్తిని గౌరవించాలి. అందరూ కలిసి మెలిసి పనిచేయండి అని మోహన్ బాబు అన్నారు.

ఆరోపణలు చేసుకొంటూ రోడ్లపైకి ఎక్కొద్దు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన వాళ్లందరూ చిన్న వాళ్లు. మీకు పెద్దవాడిగా, సీనియర్ నటుడిగా నేను కొన్ని విషయాలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని అనుకొంటున్నాను. ఏదైనా సమస్య ఉంటే ప్రసిడెంట్‌కు తెలియజేయండి. అంతేగానీ.. మీలో మీరు కొట్టుకొంటూ మీడియాలకు, టెలివిజన్ ఛానెల్స్‌లో గత కమిటీ చేసిన విధంగా పరువు తీయకండి. ఇంతకుముందు మాదిరిగా రోడ్లు ఎక్కకండి. అలాంటి పనులకు పాల్పడవద్దు అని మోహన్ బాబు తెలిపారు.

నటనలో వినోదం ఉండాలి కానీ..
వినోదం
నటనలో
ఉండాలే
కాదు.
దుర్బాషలాడితే
వినోదం
ఉండదు
అంటూ
తన
కూతురు
లక్ష్మీ
ప్రసన్నను
ఉద్దేశించి
అన్నారు.
అన్నాదమ్ములు
వీధిల్లోకి
ఎక్కినట్టు
ఉండకూడదు.
అధ్యక్షుడిగా
ఎన్నికైన
విష్ణు
వెనుక
పడి
పనులు
చేయించండి.
ఇప్పటికే
విష్ణు
చేతిలో
మూడు
సినిమాలు,
ముగ్గురు
డైరెక్టర్లు
ఉన్నారు.
ఇక
సినిమాలు
కాకుండా
విద్యాసంస్థల
బరువు
బాధ్యతలు
కూడా
ఉన్నాయి.
ఇలాంటి
బరువు
బాధ్యతలు
పెట్టుకొని
బాబు
ఏమైపోతాడనే
భయం
ఉంది.
చాలా
సమస్యలు
ఉంటాయి.
వాటిని
సమర్ధవంతంగా
ఎదుర్కోవాలి
అని
మంచు
మోహన్
బాబు
అన్నారు.

మీరు ప్రమాణ స్వీకారానికి రాకపోయినా...
షూటింగులో ఉండి ఈ వేడుకకు రాకపోయినా. మా అసోసియేషన్‌కు ఏ మాత్రం సంబంధం లేదని అనుకోవద్దు. ఈ ప్రమాణ స్వీకారానికి రాకపోయిన మీకు ఈ సంస్థతో అనుబంధం ఉంది. మీ అందరి సహకారం వల్లే ఈ సంస్థ ముందుకు వెళ్తుంది. ఈ అసోసియేషన్‌కు మీకు అనుంబంధం ఉంది. విష్ణు మంచు అందర్ని కలుపుకుపోవడానికి సిద్దంగా ఉన్నాడు. అందరి సహకారం తీసుకొని ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అని మోహన్ బాబు అన్నారు.

చిత్రపురి కాలనీ వివాదంపై స్పందిస్తూ..
పేద కళాకారులు కోసం ఇళ్ల నిర్మాణం కోసం ఏర్పడిన చిత్రపురి కాలనీ కోసం విశేషంగా కృషి చేశాను. ఓ ముఖ్యమంత్రి ఆ భూమిపై కాటు వేయడానికి ప్రయత్నిస్తే.. నేను రాజ్య సభ సభ్యుడిగా గవర్నర్ రంగరాజన్‌ను కలిసి విషయం చెప్పాను. ఆ భూమిని చిత్రపురి కాలనీకి అప్పగించేలా చేశాను. కానీ తాను చేసిన కృషిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ కొందరు సినిమా పరిశ్రమకు ఏం చేస్తున్నావని ప్రశ్నించడం సరికాదు అని మోహన్ బాబు తెలిపారు.