ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. జగన్ విజయాన్ని స్వాగతించిన మోహన్‌బాబు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై సినీ నటుడు మంచు మోహన్‌బాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజాతీర్పును ఆయన స్వాగతించారు. వైఎస్ జగన్‌కు జనం జై కొట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు ఓ ప్రకటనను విడుదల చేశారు.
ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన బిడ్డ జగన్‌కు ధైర్య సాహసాలతోపాటు ఆశీస్సులు అందించ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు వైఎస్ జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రజలు తమ ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేశారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్. అని మోహన్ బాబు అన్నారు.

ఏపీ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు గక్కుతూ మంచు మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహించారు. తాజాగా వైఎస్ జగన్ విజయాన్ని ఆయన స్వాగతించారు.


Click it and Unblock the Notifications











