విష్ణు కవల పిల్లలతో ‘దేనికైనా రెడీ’ లోగో ఆవిష్కరణ
విష్ణు, హన్సిక జంటగా 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'దేనికైనా రెడీ'. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఎం.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా' గంధర్వ మహల్ సెట్‌లో జరిగింది.
విష్ణు కుమార్తెలు ఆరియానా, వివియానా టైటిల్ లోగోను ఆవిష్కరించారు. సినిమా ట్రైలర్‌ను మోహన్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా అంతా కామెడీ నేపథ్యంలో సాగుతుందని, ప్రతి పాత్రా సినిమాలో చక్కగా డిజైన్ చేయడం జరిగిందని, కామెడీ అంటే ఇలానే ఉండాలి అనే విధంగా దర్శకుడు చిత్రీకరించారని, చిత్రంలోని పాటలను ఈ నెల 28న విడుదల చేయనున్నామని తెలిపారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. హన్సిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మొదట అక్టోబర్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేసారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి...వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.
సంగీతం హైలెట్‌గా నిలిచే ఈ చిత్రం దాదాపు పూర్తికావచ్చిందని త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోజ్, మరుధూరి రాజా, ఏవిఎస్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫాక్టరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











