మోసగాళ్లు లాభాలతో అలా.. విలాసవంతమైన ఇళ్లు.. మంచు విష్ణు ప్లానింగ్ అదుర్స్
మంచు విష్ణు ప్రస్తుతం మోసగాళ్లు ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీలైనంత ఎక్కువగా పబ్లిసిటీ చేయాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయింది. హీరోగా నిర్మాతగా రెండు బాధ్యతలను మంచు విష్ణు మోస్తుండటంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మూవీని వినూత్న రీతిలో ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈక్రమంలో వైజాగ్, హైద్రాబాద్ అంటూ తిరుగుతున్నాడు. మోసగాళ్లు సినిమా ఇప్పటికే అంచనాలు పెంచేసింది.

యదార్థ ఘటనలతో..
యదార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నాం.. ఐటీ స్కాం అంటూ మంచి కథతో రాబోతోన్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ మూవీ గుట్టంతా విప్పేశాడు. సినిమాలోని స్టోరీ, ట్విస్ట్‌లు అన్నీ కూడా చెప్పేశాడు.

విలన్ అంటూ..
మోసగాళ్లు సినిమాలో తాను విలన్ అని, కాజల్ తనకు అక్కగా నటిస్తోందంటూ అసలు గుట్టు విప్పేశాడు. అలా సినిమాకు సంబంధించిన విషయాలన్ని ముందే చెప్పేసి అంచనాలు పెంచేశాడు. ఇక తన మార్కెట్‌ను మించి ఖర్చు చేశామని, దాదాపు యాభై కోట్లు అయిందంటూ చెప్పుకొచ్చాడు.

తాజాగా అలా..
మంచు విష్ణు, నవదీప్ ఇద్దరూ కూడా సినిమాను దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో డిఫరెంట్ కాంటెస్ట్ పెట్టి.. వైజాగ్, హైద్రాబాద్ ఆడియెన్స్‌ను థ్రిల్ చేశారు. పది నిమిషాలు స్నీక్ పీక్ అంటూ రచ్చ చేశారు. అలాగే సింహాచలం గుడిలో ప్రత్యేక పూజలు కూడా చేశారు.

కొత్తిళ్లు అంటూ..
అయితే మంచు విష్ణు తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చాడు. తాను చాలా పాతకాలపు మనిషిని అని, తనతో ఉంటే బోర్ ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. తనకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమని అందరూ కలిసి ఉండాలని అనుకుంటానని చెప్పుకొచ్చాడు.

లాభాలతో కొత్త ఇళ్లు..
తాను ప్రస్తుతం శంషాబాద్‌లో ఉంటున్నాను.. కానీ హైద్రాబాద్‌లోనే ఓ కొత్త ఇళ్లు కడుతున్నాను.. మోసగాళ్లు లాభాలు వస్తాయి కూడా అంటూ గట్టిగా నమ్ముతున్నాడు. ఆ ఇంట్లో తన ఫ్యామిలీ, అమ్మ నాన్న అందరం కలిసి ఉంటామని తెలిపాడు. అయితే ఆ ఇంటిని ఎంతో విలాసవంతంగా నిర్మిస్తున్నాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











