»   » కీలు బొమ్మలమే, ఇండస్ట్రీలో సమానత్వం లేదు: మంచు విష్ణు

కీలు బొమ్మలమే, ఇండస్ట్రీలో సమానత్వం లేదు: మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచి విష్ణు నటించిన 'ఈడో రకం...ఆడో రకం' కామెడీ ఎంటర్టెనర్ ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనే టాక్ తో దూసుకెలుతోంది. తాజాగా ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు తన గురించి, ఇండస్ట్రీ గురించి, సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ఏ సినిమా అయినా ఆడక పోతే దానికి కారణం, పూర్తి బాధ్యత దర్శకుడిదే అని మంచు విష్ణు అభిప్రాయ పడ్డారు. ఒక డైరెక్టర్ యావరేజ్ స్క్రిప్టును తన టాలెంటుతో సినిమాను పెద్ద హిట్ చేయవచ్చు. ఎక్స్‌ట్రార్డినరీ స్క్రిప్టును మామూలుగా కూడా తీయొచ్చు. సినిమాకు కెప్టెన్ దర్శకుడే కాబట్టి సినిమా హిట్టయినా, ఫట్టయినా పూర్తి బాధ్యత అతనితే అని మంచు విష్ణు అన్నారు.

యాక్టర్లుగా మేమంతా డైరెక్టర్ల చేతిలో కీలు బొమ్మలం...ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడాలి. ఏ సినిమాకైనా కష్టపడటం ఒకేలా ఉంటుంది. సిన్సియర్ గా కష్టపడతాను. ఎంత కష్టపడ్డా సినీ పరిశ్రమలో లక్ అనేది కూడా ఉంటుంది. అది కూడా కలిసి రావాలి అన్నారు.

manchu vishnu

నాకు ఏ డైరెక్టరైనా స్టోరీలైన్ అయినా 15 నుండి 20 నిమిషాల్లో చెప్పాలి. అంతకంటే ఎక్కువ సేపు వినే ఓపిక నాకు ఉండదు. అది నా సమస్య. కొందరు డైరెక్టర్లు అంత తక్కువ సమయంలో ఎలా చెబతాం...కనీసం 2 గంటల సమయం అయినా ఇవ్వాలంటారు. ఢీ సినిమా స్క్రిప్టు నాకు 10 నిమిషాల్లో చెప్పారు అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

నాకు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడం(సరసాలాడటం) అలవాటు. ఈ విషయం నా భార్య వినీకి కూడా తెలుసు. ఆమె ముందే ఎవరైనా అమ్మాయిలు అందంగా ఉంటే వెంటనే చెప్పేస్తాను. నేను ఎలాంటి వాడినో వినీకి చాలా తెలుసు. ఒక్కోసారి నా ప్రవర్తన చూసి నాన్నాగారు...వీడిని అదుపులో పెట్టుకోవమ్మా అంటూ వినీని హెచ్చరిస్తుంటారు అని విష్ణు చెప్పుకొచక్చారు.

ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ విషయంలో సమానత్వం లేదు. థియేటర్లు కొందరి గుప్పిట్లో ఉండటం వల్లే ఇదంతా. చిన్న నిర్మాతలకు ఇదో పెద్ సమస్యే. ఇండస్ట్రీలో సంవత్సరానికి 200 సినిమాలు రిలీజైతే అందులో 170 సినిమాల నిర్మాతలు రిలీజ్ సమయంలో బాధ పడే పరిస్థితులు ఉన్నాయి ఇపుడు అన్నారు.

త్వరలో భక్త కన్నప్ప సినిమా చేస్తున్నాను. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నెక్ట్స్ ఇయర్ వస్తుంది. రామాయణం నా డ్రీమ్ ప్రాజెక్ట్. త్వరలోనే ఆ సినిమా చేస్తాను. మేధావుల సలహాతో ఈ సినిమా తెరకెక్కిస్తాను అన్నారు.

English summary
Tollywood actor Manchu Vishnu about Film Industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu