'సర్కార్‌' కి కాపీ కాదు కానీ... : మంచు విష్ణు

By Srikanya

హైదరాబాద్: ''సర్కార్‌' సినిమాకి ఇది కాపీ, రీమేక్‌ అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. అయితే 'గాడ్‌ఫాదర్‌' సినిమాకి దగ్గర సంబంధాలుంటాయి. నేను పని చేసిన మంచి నటుల్లో విష్ణు ఒకరని వర్మ అనడం మర్చిపోలేను.'' అంటున్నారు మంచు విష్ణు. మోహన్‌బాబు... రామ్‌గోపాల్‌ వర్మ... ,మంచు విష్ణు కలయికలో వస్తున్న 'రౌడీ' చిత్రం ఈనెల 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

'రౌడీ' కథ గురించి చెప్పాలంటే... రాయలసీమ ప్రాంతంలో అందరూ నాయకుడిలా కొలిచే ఓ అన్న కథ ఇది. ఫ్యాక్షనిజం పూర్వాపరాల్ని చూపిస్తాం. ప్రజల కోసం చట్టాన్ని చేతిలోకి తీసుకొనే ఓ మంచి రౌడీ కథ. సినిమా చూస్తే పూర్తి స్పష్టత వస్తుంది. ఇదేదో సినిమా నుంచి స్ఫూర్తి పొంది తీసినదో.. కాపీయో కాదు. పూర్తిస్థాయి ఫిక్షన్‌ ఇది.

Manchu Vishnu about his latest Rowdy

అలాగే ...ఇప్పటివరకు వచ్చిన ఫ్యాక్షన్‌ సినిమాల్లో లేని ప్రేమాభిమానాలు ఇందులో ఉన్నాయి. అవన్నీ కొత్త అనుభూతినిస్తాయి. ఇప్పటివరకు నాన్నగారు, నేను చాలా కామెడీ తరహా సినిమాలు చేశాం. ఈ సినిమా తర్వాత ఇంకెవరూ మమ్మల్ని వినోదాత్మకమైన పాత్రల్లో చూడటానికి అంగీకరించరేమో అనిపిస్తోంది. నాన్నకి 'పెదరాయుడు', 'రాయలసీమ రామన్నచౌదరి' తర్వాత జీవితంలో మైలురాయిగా నిలిచిపోయే చిత్రమిది అన్నారు.

ఇక ఫ్యాక్షనిజం కథ అంటే రక్తపాతాలే కాదు. ఆయా కుటుంబాల్లో ప్రేమాభిమానాలు, బంధాలు, అనుబంధాలు ఉంటాయి. ఈ సినిమాలో నాకు తెలియకుండానే చాలా భావోద్వేగకరమైన కుటుంబ సన్నివేశాల్ని తెరకెక్కించాను. మోహన్‌బాబు, జయసుధ, విష్ణు మధ్య సన్నివేశాలు చూస్తే అసలు సిసలు ప్రేమ, ఆప్యాయతలు కనిపిస్తాయి.

చిత్రంలో 11 నిమిషాల నిడివి ఉన్న పోరాట సన్నివేశం హైలెట్. పోరాట సన్నివేశం అంటే కేవలం కత్తులు, కొడవళ్లే చూపించం. ఆ సన్నివేశాల్లో భాగంగా కథ నడుస్తూ ఉంటుంది. విశ్రాంతికి ముందు వచ్చే ఈ సన్నివేశం ప్రేక్షకులకు విచిత్రమైన అనుభూతినిస్తుంది. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాను. చిత్రీకరణ కీలక దశకు చేరుకుంది. మరికొన్ని ప్రాజెక్టుల చర్చలు కూడా పూర్తయిపోయాయి. 'రౌడీ' విడుదల తర్వాతే ఆ విషయాల్ని ప్రకటిస్తాను అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X