»   » ఇష్టం లేదు: మోహన్ బాబు నిర్ణయంపై మంచు విష్ణు!

ఇష్టం లేదు: మోహన్ బాబు నిర్ణయంపై మంచు విష్ణు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్ బాబు ఒకప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నప్పటికీ... తర్వాత క్రమక్రమంగా పాలిటిక్స్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే త్వరలో రాజకీయాల్లోకి వెళ్లేందుకు మోహన్ బాబు ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే మోహన్ బాబు రాజకీయాల్లోకి వెళ్లడం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ... నాన్నగారు రాజకీయాల్లోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. సినిమా రంగంలో ఎంత కాలమైనా గౌరవంగా జీవించవచ్చు. అయితే రాజకీయాల్లోకి వెళితే పరిస్థితి మరోలా ఉంటుందని మంచు విష్ణు భావనగా కనిపిస్తోంది.

ఇప్పటికే చిరంజీవితో పాటు పలువురు సినీ స్టార్లు రాజకీయ రంగ ప్రవేశం చేసి... ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతో సినిమా రంగంలోకి వెళ్లినా...కొన్ని సందర్భాల్లో విమర్శలు ఎదుర్కోక తప్పదు. అందుకే నాన్న రాజకీయాల్లోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని మంచు విష్ణు తన మనసులోని అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టమవుతోంది.

Manchu Vishnu

ఏ సినిమా అయినా ఆడక పోతే దానికి కారణం, పూర్తి బాధ్యత దర్శకుడిదే అని మంచు విష్ణు అభిప్రాయ పడ్డారు. ఒక డైరెక్టర్ యావరేజ్ స్క్రిప్టును తన టాలెంటుతో సినిమాను పెద్ద హిట్ చేయవచ్చు. ఎక్స్‌ట్రార్డినరీ స్క్రిప్టును మామూలుగా కూడా తీయొచ్చు. సినిమాకు కెప్టెన్ దర్శకుడే కాబట్టి సినిమా హిట్టయినా, ఫట్టయినా పూర్తి బాధ్యత అతనితే అని మంచు విష్ణు అన్నారు.

యాక్టర్లుగా మేమంతా డైరెక్టర్ల చేతిలో కీలు బొమ్మలం...ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడాలి. ఏ సినిమాకైనా కష్టపడటం ఒకేలా ఉంటుంది. సిన్సియర్ గా కష్టపడతాను. ఎంత కష్టపడ్డా సినీ పరిశ్రమలో లక్ అనేది కూడా ఉంటుంది. అది కూడా కలిసి రావాలి అన్నారు.

English summary
Tollywood actor Manchu Vishnu comments about Mohan Babu political Re-entry.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu