twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మోసగాళ్లు’ సీక్రెట్స్ .. స్టోరీ, ట్విస్ట్‌లు, బడ్జెట్ అన్నీ చెప్పేసిన మంచు విష్ణు!

    |

    మంచు విష్ణు కాజల్ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రం మోసగాళ్లు. అయితే ఈ చిత్రం యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించామని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అయితే తాజాగా మోసగాళ్లు టీజర్ రిలీజ్ చేశాక మంచు విష్ణు మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సినిమా గురించి అనేక సీక్రెట్స్ బయట పెట్టేశాడు. సినిమాలోని ట్విస్ట్‌లు ముందే చెప్పేసి అందరిలోనూ హైప్‌ను తగ్గించే ప్రయత్నంచేశాడు.

    స్టోరీ అదే..

    స్టోరీ అదే..

    కాల్ సెంటర్స్ స్కాం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాం.. గుజరాత్, ముంబైలోని అన్నాచెల్లెళ్లు కలిసి అమెరికాలోని ఓ స్కాం చేశారు.. వారి స్కాం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. అలా వీరు దాదాపు నాలుగు వేల కోట్లు దోచుకున్నారు. అది ఎలా బయటకు వచ్చింది.. వారు ఎలా చిక్కారు అనే దాన్ని చూపించామని విష్ణు చెప్పుకొచ్చాడు.

    ట్విస్ట్‌లు కూడా..

    ట్విస్ట్‌లు కూడా..

    మోసగాళ్లు సినిమాలోని ట్విస్ట్‌లను ముందే చెప్పేశాడు మంచు విష్ణు. ఈ సినిమాలో హీరో నేను కాదు. హీరో కాజల్ అగర్వాల్. నేను విలన్‌ను. కాజల్ అగర్వాలే మెయిన్ లీడ్. అందుకే ఈ మూవీ టైటిల్‌ తెలుగులో మోసగాళ్లు అని ఉంది కానీ మిగతా భాషల్లో వేరేగా ఉంటుంది. ఆ టైటిల్‌ను కాజల్ అగర్వాల్ వచ్చే వారం రివీల్ చేస్తుందని మంచు విష్ణు పేర్కొన్నాడు.

    అన్నా చెల్లెళ్లుగా..

    అన్నా చెల్లెళ్లుగా..

    అయితే మోసగాళ్లు చిత్రంలో కాజల్ అగర్వాల్, మంచు విష్ణులు హీరో హీరోయిన్లు కాదు. ఈ విషయం గత ఏడాది రాఖీ పండుగ రోజే చెప్పీ చెప్పనట్టుగా చెప్పేశారు. కానీ తాజాగా మంచు విష్ణు ఓక్లారిటీ ఇచ్చాడు. ఇందులో కాజల్, తాను బ్రదర్ అండ్ సిస్టర్‌గా నటించామని చెప్పుకొచ్చాడు.

    బడ్జెట్..

    బడ్జెట్..

    ఇక మోసగాళ్లు బడ్జెట్ గురించి మంచు విష్ణు చాలానే మాట్లాడాడు. నిర్మాతగా ఈ చిత్రంతో ఎన్నో నేర్చుకున్నాను. ముందు అనుకున్న దాని కంటే ఎక్కువగా బడ్జెట్ దాటిపోతుందని అనిపించింది. మామూలుగా 40 శాతం ఎక్కువయ్యేలా కనిపించింది. కానీ రిస్క్ అయినా పర్లేదని ముందడుగు వేశాను అని చెప్పుకొచ్చాడు.

    యాభై కోట్లు..

    యాభై కోట్లు..

    మోసగాళ్లు సినిమా కోసం చిరంజీవి, వెంకటేష్ ఇలా ఎంతో మంది సాయం చేశారు. వీరంతా లేకపోతే ఇంత భారీ బడ్జెట్ యాభై కోట్ల సినిమా మీ ముందుకు వచ్చేది కాదంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. తనకు ఇంత మార్కెట్ ఇప్పుడు లేదని తెలిసినా రిస్క్ చేస్తున్నాని చెప్పుకొచ్చాడు.

    English summary
    Manchu Vishnu About Mosagallu Story And Budget, Manchu Vishnu Mosagallu trailer out,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X