వైవియస్ చౌదరి దెబ్బకేనా ఆ హీరో పేషెంట్ లా
వైవియస్ చౌదరి తో చేసిన 'సలీం' సినిమా తన ఫైనాన్సియల్ గా ఇబ్బందులు పాలు చేసిందని ఈ మధ్యన మంచు విష్ణు చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తను ఆ సినిమా కోసం మారానని అప్పటినుంచీ తనని పేషెంట్ గా ఉన్నావంటున్నారని అన్నాడు. ఒకప్పుడు లావుగా బొద్దుగా వుండేవారు కదా అప్పుడే బాగుండేవారని చాలామంది అంటున్నారని మీడియా వారు అడిగితే బదులిస్తూ ఇలా బయిటపడ్డారు. చిత్తూరులోని మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న విద్యానికేతన్ వార్షికోత్సవం సందర్భంగా ఆయన హాజరయి అక్కడవారితో మాట్లాడారు. ఆయన నటించిన 'వస్తాడు నా రాజు' చిత్రంలో పేషెంట్‌లా వున్నావని అందరూ అడిగారట. బాక్సింగ్ చేసేవాడు అలా వుండకూడదుగదా.. అని విద్యార్థులు అడిగితే...కరెక్టే...అప్పట్లో బాగా లావుగా వున్నాను.. కాస్త తగ్గాలని కొందరు హీరోలు చేస్తున్న పద్ధతిలు అవలంభించా... కానీ అది ఇలా అవుతుందనుకోలేదని బాధను వ్యక్తం చేశారు.అయితే త్వరలో మిమ్మల్ని మామూలు విష్ణులా చూడవచ్చా? అని అడిగితే... జున్, జులైనాటికి కాస్త వళ్ళుచేస్తానని చెప్పాడు. ప్రస్తుతం విష్ణు తన తదుపరి చిత్రం కోసం లక్స్ సబ్బు వారి సౌజన్యంతో బ్యూటీ కాంటెస్ట్ ని నిర్వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











