మోహన్ బాబు కొడుకు విష్ణు ‘దొరకడు’
మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు చాలా కాలం తర్వాత 'దొరకడు' అంటూ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మంచు లక్ష్మి ఈ చిత్రాన్ని తన లక్ష్మి ప్రసన్న పక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తోంది. ఇందులో విష్ణు సరసన హన్సిక రొమాన్స్ చేయనున్నట్లు సినీ వర్గాల నుంచి అందిన సమాచారం.
చివరగా 'వస్తాడు నా రాజు' సినిమా చేసిన విష్ణు ఆ సినిమా పరమ ప్లాపు కావడంతో గ్యాప్ తీసుకున్నాడు. దీనికి తోడు అతని భార్య వెరొనికా ప్రెగ్నెస్సీ కావడంతో ఈ గ్యాప్ మరింత పెరిగింది. ఇటీవలే ఇద్దరు కవల పిల్లలకు తండ్రయిన విష్ణు చాలా సంతోషంగా ఉన్నాడు. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాడు. ఢీ సినిమా తప్ప తన కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్లేవీ లేని విష్ణుకు తండ్రైన తర్వాత అయినా కలిసివస్తుందో? లేదో? చూడాలి మరి.


Click it and Unblock the Notifications











