నేనో కిక్ బాక్సర్ ని...మంచు విష్ణు వర్ధన్
నేనో కిక్ బాక్సర్‌గా ఈ చిత్రంలో కనిపిస్తాను. అందరి అమ్మాయిల్లానే మా సినిమాలో హీరోయిన్ కూడా కలల్లో విహరిస్తూ ఉంటుంది. వాటిని నేను ఎలా నిజం చేశానో మీరు తెలుసుకోవాలంటే 'వస్తాడు నా రాజు' సినిమా చూడాల్సిందే అంటున్నారు మంచు విష్ణు. ఆయన తాజా చిత్రం 'వస్తాడు నా రాజు' ఈనెల 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే తాను ఈ చిత్రంలో ప్రేమకు పూర్తి విరుద్దంగా నడుస్తూంటానని, అలాంటి తాను ప్రేమలో పడిపయి ఆమెకోసం ఏదైనా చేయటానకి రెడీ కావటం సరదాగా ఉంటుందని అన్నారు.
ఇక ఈ చిత్రంలో విష్ణు పాత్ర పేరు వెంకటప్పయ్య నాయుడు. ప్రేమాగీమా అంటూ పట్టింపులేనీ, వాటిపై నమ్మకంలేని కుర్రాడు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనే టైపు. ఏ ఎండకా గొడుగు పట్టేస్తుంటాడు...అదీ అతని క్యారక్టైరేజేషన్.ఈ చిత్రంలో విష్ణు ప్రేయసిగా తాప్సీ చేస్తోంది. ఈ చిత్రం ద్వారా హేమంత్ మధుకర్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. 24 ఫ్రేమ్స్ సంస్థ నిర్మించింది. సంగీతం: మణిశర్మ.


Click it and Unblock the Notifications











