సులేమాన్,కృష్ణ శాస్త్రిలుగా మంచు విష్ణు
హైదరాబాద్ : మంచు విష్ణు త్వరలో సులేమాన్,కృష్ణ శాస్త్రిలుగా కనిపించి మురిపించనున్నారు. మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం 'దేనికైనా రెడీ'. హన్సిక హీరోయిన్. మోహన్‌బాబు నిర్మాత. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకొన్నాయి. ఈ చిత్ర పాటల విజయోత్సవం ఇటీవల బెంగళూరులో జరిగింది. ఈ సందర్బంగా మంచు విష్ణు మాట్లాడుతూ...'లక్ష్యం ఉంటే సరిపోదు. దాన్ని చేరుకొనే మార్గం వెతకాలి. కష్టనష్టాలు పక్కన పెట్టి ఆ దారిలో పయనించాలి. కల నెరవేర్చుకోవడానికి దేనికైనా సిద్ధంగా ఉండాలి. సులేమాన్, కృష్ణశాస్త్రిలకు కూడా ఓ గమ్యం ఉంది. దాన్ని అందుకోవడానికి వారు ఏం చేశారో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే' అన్నారు విష్ణు.
దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ''వినోదాత్మకమైన ప్రేమకథ ఇది. కుటుంబ బంధాలకు పెద్దపీట వేశాం. విష్ణు రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఇద్దరూ ఒక్కరా? కాదా? అనే విషయం ఆసక్తికరం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఒక యువకుడు తన ప్రేమను గెలిపించుకోవడానికి ఎలాంటి సాహసాలు చేశాడు? అనే విషయం తెరపైనే చూడాలి. విష్ణు నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన్ను కొత్తకోణంలో చూపించే ప్రయత్నం చేశాము. చక్రి, యువన్‌శంకర్‌రాజా స్వరసారథ్యంలో ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది, సినిమా విజయం తథ్యంఈ నెల 24న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. కర్ణాటకలోనూ విడుదల చేస్తున్నాం'' అన్నారు.
ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి...వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.
ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌బాబు.


Click it and Unblock the Notifications











