twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటప్పనాయుడుగా మంచు విష్ణు వర్ధన్

    By Srikanya
    |

    మంచు విష్ణు వర్దన్ తాజా చిత్రం 'వస్తాడు నా రాజు' లో అతను కిక్‌ బాక్సర్‌ వెంకటప్పనాయుడుగా కనిపిస్తాడు. ప్రేమాగీమా అంటూ పట్టింపులేనీ, వాటిపై నమ్మకంలేని కుర్రాడు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనే టైపు. ఏ ఎండకా గొడుగు పట్టేస్తుంటాడు...అదీ అతని క్యారక్టైరేజేషన్. ఇక కథ విషయానికి వస్తే.. 'వస్తాడు నా రాజు' అంటూ అందమైన అమ్మాయి తాప్సీ.. వేయి కళ్లతో ఎదురుచూస్తూంటుంది. ఆమె కళ్ల ముందే అతను ఉన్నా కనిపెట్టలేదు.

    ఊహల్లో విహరిస్తుంటూంది. ఆ ఎదురు చూపులతో సాగే ఆ అందాల భామ జీవితం ఎలా ఉంటుంది? ఆమె కలల రాకుమారుణ్ని కలిసే క్షణాన ఏమైంది? అన్నదే అసలు కథ.అలాగే ఈ చిత్రం రొమాంటిక్ కామిడీ జెనర్ కి చెందింది అంటున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా హేమంత్ మధుకర్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని విష్ణు తన స్వంత బ్యానర్ 24 ప్రేమ్స్ పై నిర్మిస్తున్నారు. "వస్తాడు నా రాజు" చిత్రం సెకెండాఫ్ లో బ్రహ్మానందం కామెడీ హైలెట్ కానుందని తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X