»   » సెన్సార్ గొడవ: సీబీఐ కోర్టులో హాజరైన మంచు విష్ణు

సెన్సార్ గొడవ: సీబీఐ కోర్టులో హాజరైన మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు సోమవారం సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. సెన్సార్‌బోర్డు సభ్యుడు శ్రీనివాసరావు కేసులో సీబీఐ ఎదుట మంచు విష్ణు సాక్షిగా హాజరయ్యారు. అందాల చందమామ సినిమా సెన్సార్‌కు రూ. 5లక్షలు డిమాండు చేసిన బోర్డు మెంబర్‌ శ్రీనివాసరావును గత నెలలో సీబీఐ అధికారులు అరెస్టు చేసి కేసు పెట్టారు. ఈ కేసులో మంచు విష్ణు సాక్ష్యం చెప్పేందుకే సీబీఐ కార్యాలయానికి వచ్చారని అధికారులు చెప్పారు.

సెన్సార్ బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయంటూ గతంలో మంచు విష్ణు ఫిర్యాదు చేసారు. సెన్సార్ సర్టిఫికెట్లకు డబ్బులు తీసుకుంటున్నారని...దీనిపై విచారణ జరిపించాలని సీబీఐకి ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా మంచు విష్ణు సీబీఐ కోర్టులో హాజరయ్యారు.

గతంలో దొరికిపోయిన అధికారి...
తెలుగు సినిమాలకు సెన్సార్ సర్టిపికెట్ జారీ చేసే అధికారి శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ కొన్ని రోజుల క్రితం దొరికిపోయారు. ‘అందాల చందమామ' అనే సినిమా ‘యూ' సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారి శ్రీనివాసరావు లంచం డిమాండ్ చేసారు. దీంతో ఆ చిత్ర నిర్మాత ప్రసాద్ రెడ్డి సీబీఐని ఆశ్రయించారు.

Manchu Vishnu attend CBI Court

నిర్మాత ప్రసాద్ రెడ్డి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు టాలీవుడ్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి నిర్మాత వద్ద నుండి లంచం తీసుకుంటుండగా రెండ్ హాండెడ్ గా పట్టుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో సెన్సార్ బోర్డు అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి సినిమాలకు ఇచ్చే సర్టిఫికెట్ల విషయంలో కూడా అవినీతి రాజ్యమేలుతుందనే విషయం స్పష్టమవుతోంది.

English summary
Manchu Vishnu attend CBI Court in censor board case.
Please Wait while comments are loading...