ప్రసవించిన వెరోనికా-ట్విన్ గర్ల్స్‌కు తండ్రైన విష్ణు
మంచువారి అభిమానులకు శుభవార్త. మంచు విష్ణు-వెరోనికా ఇద్దరు కవల ఆడ పిల్లలకు జన్మినిచ్చారు. శనివారం ఉదయం అమెరికాలోని న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్‌లో వెరోనికా ప్రసవించింది. విష్ణు సోదరి మంచు లక్ష్మి ప్రసన్న ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇద్దరు పిల్లలతో పాటు వెరోనికా ఆరోగ్యంగా ఉన్నారని, మా ఇంట పుట్టిన ఇద్దరు ఏంజెల్స్ అచ్చం వెరోనికాలానే ఉన్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇటు మోహన్ బాబుతో పాటు మంచు ఫ్యామిలీ మొత్తం, అటు వెరోనికా కుటుంబ సభ్యులు గత కొన్ని రోజుల క్రితమే అమెరికా చేరుకున్నారు.
Most magical day, vinimanchuand my two 'new' angels are beautiful and healthy.baby1, looks like the Manchus & baby2 just like mommy:)....అంటూ తన ట్విట్టర్ లో పేర్కొంది లక్ష్మి.
వెరోనికాకు అమెరికా పౌరసత్వం ఉన్నందున....ఈ ఇద్దరు పిల్లలు కూడా పుట్టుకతోనే అమెరికన్ సిటీజెన్స్ అయ్యారు. వెరోనికా ప్రసవంతో మంచు ఫ్యామిలీ మొత్తం ఆనందోత్సాహాల్లో మునిగి పోయింది. ఒకేసారి డబుల్ ప్రమోషన్ సాధించిన విష్ణు ఆనందం ఓరేంజ్ లో ఉంది.


Click it and Unblock the Notifications











